రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు తెలుపుతూనే ఉన్నారు.ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం 1200ఎకరాల భూమిని సేకరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించగా.. తమ భూములు ఇచ్చేది లేదని రైతులు ఎదురుతిరిగారు. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా పరిగి మండలం కలాపూర్, రాపోల్ గ్రామస్తులు పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు. తమ భూములు ఇచ్చేది లేదంటూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి లైట్లు ఆర్పి మహిళా రైతులను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి లైట్లు ఆపేసి పోలీసులు తమపై దాడులు చేశారని మహిళా రైతులు ఆరోపిస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు ఇచ్చేది ఇచ్చేది లేదంటూ ఆ రెండు గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. గతంలో భూములు తీసుకోబోమని ఎమ్మెల్యే, అధికారులు హామీ ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ ఎందుకు అడుగుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, ఇప్పుడు మాట మార్చారని అన్నదాతలు మండిపడుతున్నారు.అసెంబ్లీలో భూములు ఇచ్చేశామని చెప్పడం అవాస్తవమని గ్రామస్తులు అంటున్నారు. ఇండస్ట్రియల్ పార్కు పనులు ప్రారంభించాలని స్థానిక ఎమ్మెల్యే చెప్పడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
https://x.com/pulsenewsbreak/status/2099344889641111778?s=20
మహిళలు అని కూడా చూడకుండా అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మహిళా రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఏం చేసినా తమ భూములు ఇండిస్ట్రియల్ పార్కు కోసం ఇవ్వబోమని భీష్మించుకు కూర్చుకున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే,ప్రభుత్వం మాట మార్చిందని వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని భూములు కోల్పోతున్న ప్రజలు, మహిళా రైతులు తెగేసి చెప్పారు.కాగా, అర్దరాత్రి మహిళా రైతుల మీద పోలీసులు దాడులు చేయడం, అరెస్టులు చేయడం ఏంటని ప్రతిపక్షాలు సర్కారు మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
https://x.com/pulsenewsbreak/status/2099344889641111778?s=20










