BSNL: దసరా, దీపావళి పండగల సీజన్‌లో మొబైల్ యూజర్స్‌కి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఊహించని బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రైవేట్ టెలికాం నెట్‌వర్క్‌లన్నీ రీఛార్జ్ ధరలను పెంచేసి సామాన్యులపై భారం మోపుతున్న టైంలో.. కేవలం ఒక్క రూపాయి (రూ.1) కి ఫ్రీ సిమ్ కార్డుతో పాటు 24 రోజుల పాటు ఫ్రీ సర్వీసులను అందిస్తూ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది.
‘ఫ్రీడమ్ 2.0’ ధమాకా.. రూపాయికే 24 రోజుల పాటు అన్నీ ఫ్రీ
వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తున్న ‘ఫ్రీడమ్ 2.0’ ప్లాన్ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ కల్పిస్తున్న అద్భుత ప్రయోజనాలు ఇవే.. కేవలం ఒక్క రూపాయికే కొత్త సిమ్ కార్డు రావడంతో పాటు 24 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ రావడం, అలాగే ప్రతిరోజూ 1 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు రోజుకు 100 ఫ్రీ ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఒక్క రీఛార్జ్‌కే వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన ఈ రోజుల్లో, కేవలం రూ.1 తో కొత్త సిమ్‌తో పాటు 24 రోజుల వ్యాలిడిటీ దొరకడం మొబైల్ యూజర్స్‌కి నిజంగా పండగ బొనాంజా లాంటిదే అని చెబుతున్నారు.
అక్టోబర్ 12 వరకే ఛాన్స్..
ఈ అద్భుతమైన ఆఫర్ కేవలం కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ తీసుకునే వారికి, అలాగే వేరే ప్రైవేట్ నెట్‌వర్క్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ (ఎమ్ఎన్‌పీ) అయ్యే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్న యూజర్స్‌కి ఇది వర్తించదు. ఈ ప్రత్యేక పండగ ఆఫర్ అక్టోబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ బెనిఫిట్స్‌ను పొందాలనుకునే వాళ్లు అక్టోబర్ 12 లోపు మీకు సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ కేర్ సెంటర్‌కి వెళ్లి, ఆధార్ కార్డుతో కేవైసీ కంప్లీట్ చేసి రూపాయికే ఈ సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.


