తెలంగాణ

TG: సుప్రీంకోర్టుకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. గెజిట్ రిలీజ్!

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

TG: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక నియామకం చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలందిస్తున్న జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ పదోన్నతి పొంది సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2) ప్రకారం నియామకం

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 క్లాజ్ (2) ద్వారా సంక్రమించిన అధికారాల మేరకు భారత రాష్ట్రపతి ఈ నియామకానికి ఆమోదముద్ర వేశారు. జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియామకం అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ జాయింట్ సెక్రటరీ జగన్నాథ్ శ్రీనివాసన్ పేరుతో అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా కీలక సేవలందించిన జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లడం న్యాయవర్గాల్లో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య మరింత పెరగనుంది.

#Telangana#TG News#Telangana High Court#Supreme Court#Supreme Court of India#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి