తెలంగాణ

Government Hospitals: ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వాలకు లేదా నజర్!!.. సోది మాటలు-కాకి లెక్కలు..

రచన: Venu••9 నిమిషాల పఠనం

పేదవారికి జబ్బు చేస్తే ముందుగా గుర్తుకు వచ్చేది సర్కారు దవాఖాన.. అందువల్ల ఎన్ని ప్రభుత్వ ఆస్పత్రులున్న అందులో సిబ్బంది సంఖ్యతో పోలిస్తే రోగుల సంఖ్య విపరీతంగా ఉండటం వల్ల వైద్యం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్న ఆరోపణలున్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రి అంటే పేదలకు ఆలయాల వంటివని చెబుతారు. కానీ మన రెండు రాష్ట్రాలలోని ప్రభుత్వ ఆస్పత్రుల తీరు రోజు రోజుకు చర్చంశనీయాంశంగా మారుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందుతుండగా, మరికొన్ని చోట్ల కనీస వసతుల కొరత, సిబ్బంది నిర్లక్ష్యం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి..

ఇక పేదవారికి జబ్బు చేస్తే ముందుగా గుర్తుకు వచ్చేది సర్కారు దవాఖాన.. అందువల్ల ఎన్ని ప్రభుత్వ ఆస్పత్రులున్న అందులో సిబ్బంది సంఖ్యతో పోలిస్తే రోగుల సంఖ్య విపరీతంగా ఉండటం వల్ల వైద్యం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్న ఆరోపణలున్నాయి. మరికొన్ని చోట్ల బెడ్లు, డయాగ్నోస్టిక్ మిషన్లు, పరిసరాల పరిశుభ్రత లోపించడం వంటి ప్రధాన సమస్యలపై విమర్శలున్నాయి.

ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవసరమైన సంఖ్యలో నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. ఇలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల ప్రాణాలకు భరోసా లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ డాక్టర్లు సొంత క్లినిక్ లు ఏర్పాటు చేసుకొని తమ దగ్గరికి వచ్చే రోగులను వారి సొంత ఆస్పత్రులకు రప్పించుకుంటున్నారనే ఆరోపణలున్న విషయం తెలిసిందే..

ఇదేకాకుండా శానిటేషన్‌ ‌మొదలు అత్యవసర యంత్రాల నిర్వహణ, ఓపీకి తగ్గట్టుగా సిబ్బంది లేకపోవడం, ఉచిత మందుల కొరత, పరీక్షలు చేసే పరికరాలు పాడైపోవడం, మరుగుదొడ్ల నిర్వహణ వంటి పలు సమస్యలతో వైద్యం కోసం వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక సీజనల్‌ వ్యాధులు, సాధారణ అనారోగ్య సమస్యలతో ఓపీకి వచ్చే వారి సంఖ్య పెరగడంతో రిజిస్ట్రేషన్‌ నుంచి వైద్య పరీక్షలు, డయాగ్నస్టిక్‌ సేవలు, మందుల పంపిణీ వరకు నిరీక్షణ తప్పడం లేదనే ఆరోపణలున్నాయి.

ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రధానంగా ​ఉదయం ఆస్పత్రి ప్రారంభ సమయానికే ఓపీ రిజిస్ట్రేషన్‌ కౌంటర్ల వద్ద రోగుల క్యూ ఉంటోంది. రిజిస్ట్రేషన్‌ స్లిప్‌ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. స్లిప్‌ తీసుకున్న తర్వాత జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌ తదితర విభాగాల వద్ద వైద్యుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. చివరికి వారు రోగిని పరీక్షించాక టెస్టులు రాస్తే ఉన్న సమయం అక్కడే పోతుందని రోగులు వాపోతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్‌ వద్ద అమానవీయ ఘటన చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40 ఏళ్ల వయసున్న ఓ అనాథ.. కాలికి గాయం కావడంతో మూడు రోజుల క్రితం జీజీహెచ్‌కు వచ్చినట్టు తెలుస్తుంది.. అత్యవసర విభాగంలో అతన్ని వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. కానీ తీవ్రమైన నొప్పితో, నడవలేని పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఆసుపత్రి పరిసరాల్లోనే దీనంగా ఉండిపోయాడు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆసుపత్రి సెక్యురిటీ సూపర్‌వైజర్, మరో ఇద్దరు గార్డులు కలిసి అతడిని స్ట్రెచర్‌పై తీసుకువెళ్లి మార్చురీ సమీపంలోని ప్రధాన గేటు బయట వదిలేశారని సమాచారం.. తీవ్ర అవస్థతతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయనకు స్థానికులు ఆహారం, మంచినీళ్లు అందించారు.కానీ అతని ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది.

మరోవైపు పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు నిరంతరం అందుబాటులో ఉంటున్నాయని, వైద్యానికి బడ్జెట్ లో పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాల తీరును ఇలాంటి సంఘటనలు ప్రశ్నిస్తున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చోటు చేసుకున్న కొన్ని ఘటనలను పరిశీలిస్తే.. వరంగల్‌ ఎంజీఎంలో పై పెచ్చులు ఊడిపడటంతో రోగులు భయాందోళనతో చికిత్స చేయించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

అదేవిధంగా ఆదిలాబాద్‌ ‌రిమ్స్‌‌లో అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుద్ఘాతానికి పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం విమర్శలకు దారి తీసింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో నీటి సమస్యతో పాటు బెడ్ల కొరత తీవ్రంగా ఉందనే ఆరోపణలున్నాయి.. అలాగే నీలోఫర్‌, తదితర ఆస్పత్రుల్లో రాత్రి సమయాల్లో అత్యవసర సమయాల్లో వైద్యం అందించే డాక్టర్లు కొరత వేధిస్తోందనే ఆరోపణలున్నాయి.

ఇవే కాకుండా గాంధీ, నిమ్స్, బీబీనగర్ ఎయిమ్స్ వంటి ఆస్పత్రుల్లో కూడా పలు సమస్యలున్నట్టు ఆరోపణలున్నాయి. అలాగే నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs) సెంటర్లలో సిబ్బంది దురుసు ప్రవర్తన, మందుల కొరత నిత్యం రోగులకు ఎదురవుతున్న సమస్యలే.. వీటిని పట్టించుకునే దిక్కులేదు.. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ ‌వైద్యం అందిస్తామని చెబుతున్నా ప్రభుత్వాలు అమలులో విఫలం అవుతున్నాయనే ఆరోపణలున్నాయి.

మరోవైపు పలు ఆస్పత్రుల్లో పలువురు హెచ్‌ఓడీలు, అధికారులు ఉండటం లేదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో వైద్యం కోసం అందిస్తున్న నిధులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయనే ప్రశ్నలకు సమాధానాలు లేకున్నాయి. అంతే కాకుండా ప్రయివేటు కాంట్రాక్టర్లు, ఏజెన్సీలతో కుమ్మక్కు కావడం వల్లే నాసిరకం పనులు జరిగి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇలా కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము అవినీతి రూపంలో బయటికి పోతున్నా ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే నిత్యం ఎదుర్కోనే సమస్యలు కూడా చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిష్కారం కావడం లేదనే ఆరోపణలున్నాయి.. ఇక నిధుల లోటు ఉందని చెబుతున్న ప్రభుత్వంలోని రాజకీయ నాయకుల ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి. కానీ పేదవారికి ఉచిత వైద్యం అందించేందుకు మాత్రం నిధుల కొరత అంశం తెరపైకి తేవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది.

#GovernmentHospitals#PublicHealthcare#GovernmentHospitalIssues#HealthcareCrisis#HealthcareSystem#PoorPatients#HospitalNegligence#AndhraPradesh#Telangana#GunturGGH#WarangalMGM#AdilabadRIMS#OsmaniaHospital#NiloferHospital#GandhiHospital#NIMS#AIIMSBibinagar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి