టాప్ న్యూస్

TS : రేవంత్ సర్కార్ బాదుడే బాదుడు.. ప్రజల నెత్తిన మరో పిడుగు!

రచన: Kumar••5 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రజల నెత్తిన మరో పిడుగు పడనుంది. ఇప్పటికే సామాన్యుడి నడ్డి విరుస్తున్న సర్కార్ మరోసారి చార్జీల భారం మోపేందుకు సిద్ధమైంది. నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యులు అల్లాడుతున్నారు.బియ్యం చార్జీలు ఆకాశన్నంటుతున్నాయి. కూరగాయాలు, ఉప్పు, పప్పులు ధరలు కూడా పెరిగాయి. దీనికి ఎల్‌నినో కారణమని ప్రభుత్వం చెబుతోంది.

తెలంగాణ ప్రజల నెత్తిన మరో పిడుగు పడనుంది. ఇప్పటికే సామాన్యుడి నడ్డి విరుస్తున్న సర్కార్ మరోసారి చార్జీల భారం మోపేందుకు సిద్ధమైంది. నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యులు అల్లాడుతున్నారు.బియ్యం చార్జీలు ఆకాశన్నంటుతున్నాయి. కూరగాయాలు, ఉప్పు, పప్పులు ధరలు కూడా పెరిగాయి. దీనికి ఎల్‌నినో కారణమని ప్రభుత్వం చెబుతోంది. అంతేకానీ, ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

ఎల్ నినో ప్రభావం ఉంటుందని తెలియగానే కొందరు బియ్యం, నిత్యావసర వస్తువులకు మార్కెట్లో కొరత సృష్టించి అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరోవైపు సివిల్ సప్లయీస్‌లో రూ. వేల కోట్లలో సీఎంఆర్ఎస్ పక్కదారి పట్టినట్టు కథనాలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే రైస్ మిల్లర్ల మీద దాడులకు సర్కార్ సిద్ధమైంది. కానీ, ధరల నియంత్రణపై మాత్రం సర్కార్ ఫోకస్ చేయడం లేదని సామాన్యులు, ప్రతిపక్షాలు సైతం పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నాయి.

రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన రేవంత్ సర్కార్.. బస్సు చార్జీలను అమాంతం పెంచింది. మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తూనే పురుషులకు అధిక చార్జీలు విధిస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి సాధారణ ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ కంటే ఎక్కువగా టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నదని మగ ప్రయాణికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ఫ్రీ బస్సు స్కీం తెచ్చి ఆర్టీసీ బస్సు ఎక్కకుండా చేస్తున్నారని.. పండుగల సమయంలో స్పెషల్ బస్సుల పేరిట మరింత దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు 50 శాతం మేర బస్సు చార్జీలు పెరిగినట్టు తెలిసింది.

ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా నడిచే ఆటోలకు మినిమమ్ ఫేర్ రూ.30 మేర పెంచుతూ ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆటో ఎక్కే ప్యాసింజర్స్‌కు తడిసిమోపెడు కానుంది. ఓవైపు బస్సుల్లో బాదుడు.. మరోవైపు ఆటోల్లో బాదుడు వలన సామాన్యడు చుక్కలు చూస్తున్నాడు. బయట ధరల భారం, రవాణా భారం కావడంతో తల పట్టుకుంటున్నాడు. చాలిచాలనీ జీతంతో ఎలా బతకాలని ఆవేదన చెందుతున్నాడు. వేతనాలు పెరగక, బయట ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నాడు.

ఇదిలాఉండగా, రేవంత్ సర్కార్ సామాన్యుడి మీద మరో భారం మోపేందుకు సిద్ధపడింది. తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెంచేందుకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. దీంతో విద్యుత్ వినియోగదారులపై ‘ట్రూ అప్’ ఛార్జీల భారం పడనుంది. నవంబర్ 1 నుంచి ట్రూ అప్ ఛార్జీల వసూలుకు ఈఆర్సీ అనుమతి ఇవ్వడంతో వసూలుకు డిస్కంలు రెడీ అవుతున్నాయి. నవంబర్ నెలలో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసలు వసూలు చేయనున్నట్టు తెలిసింది. SPDCLకు 29 నెలలు, NPDCLకు 26 నెలలు వసూలుకు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది.కాగా, వ్యవసాయ రంగానికి మినహాయింపు ఇవ్వగా.. రైతుల వాటా రూ.2,215 కోట్లు ప్రభుత్వమే చెల్లించనుంది.

2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన విద్యుత్‌ కొనుగోలు వ్యయం, ఆదాయ ట్రూ-అప్‌ బకాయిల కింద ఆమోదించిన మొత్తం రూ.7,635.22 కోట్లలో.. వ్యవసాయేతర వినియోగదారుల నుంచి రూ.5,420.23 కోట్లను వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) మార్గాన్ని సుగమం చేసినట్టు తెలిసింది.

#electricity charges#increase#telangana#Npdcl#Spdcl#hyderabad#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి