International

Trump: ‘ఫ్లైదుబాయ్’ దాడిలో ఇరాన్ హస్తం ఉందా? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఉగ్రదాడి ఉదంతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చర్‌పై ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్ హమామ్ అల్ హమ్మామీ జరిపిన ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చని ఆయన ఆరోపించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్న ట్రంప్, తన ఆరోపణలకు అనుగుణంగా ఎలాంటి అధికారిక సమాచారాన్ని బయటపెట్టలేదు.

ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఉగ్రదాడి ఉదంతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చర్‌పై ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్ హమామ్ అల్ హమ్మామీ జరిపిన ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చని ఆయన ఆరోపించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్న ట్రంప్, తన ఆరోపణలకు అనుగుణంగా ఎలాంటి అధికారిక సమాచారాన్ని బయటపెట్టలేదు.

అయితే, ఓ ప్రెస్‌మీట్ విలేకరి ప్రశ్నిస్తూ ఫ్లైదుబాయ్ దాడిలో ఇరాన్ హస్తం ఉందనుకుంటున్నారా? అని అడిగారు. దీనికి ట్రంప్ బదులిస్తూ ఇరాన్ ప్రమేయం ఉండొచ్చని బదులిచ్చారు. ఒకవేళ ఈ దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపై తీవ్ర స్థాయిలో ప్రతికార చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు.

ఈ ఘటన వెనుక ఇరాన్ ప్రమేయం ఉందనడానికి అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు సేకరించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ దాడిపై లోతైన విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తికాకుండా ఏ తీర్మానానికి రాలేమని పేర్కొన్నారు. విమానాన్ని టెల్ అవీవ్‌లోని బెన్-గురియెన్ విమానాశ్రయంపై కూల్చివేసేందుకు నిందితుడు యత్నించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ, భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ అత్యంత సమయస్ఫూర్తితో పోరాడి విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండ్ చేసి 170 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. తీవ్రవాద భావజాలం ఉన్న కో-పైలట్ హమ్మామీపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

ఇదిలా ఉండగా ప్పటికే ఈ ఘటనకు బాధ్యతను వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటనను తెలపలేదు. అయితే, ట్రంప్ అనుమానాల నేపథ్యంలో ఈ దాడి ఎవరు చేయించింది అనేది మాత్రం దర్యాప్తులో తేలనుంది. ప్రస్తుతానికి పోలీసులు విమానంలో దాడికి దిగిన కోపైలట్‌ను విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనను ఉద్దేశించి అల్‌ఖైదా మద్దతు పోస్టు చేయడం చర్చనీయాంశమైంది.

#DonaldTrump#FlydubaiAttack#SmitMachchhar#Iran#JDVance#AviationSecurity#Israel
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి