తెలంగాణ

TG: రూ.4 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: జీహెచ్‌ఎంసీ టౌన్‌‌ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ఏకంగా రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూల్స్‌ను తుంగలో తొక్కి అడ్డదారిలో పనులు చేసిపెట్టేందుకు బేరసారాలు సాగించిన సదరు అధికారిణి చివరికి కటకటాలపాలైంది.

TG: జీహెచ్‌ఎంసీ టౌన్‌‌ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ఏకంగా రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూల్స్‌ను తుంగలో తొక్కి అడ్డదారిలో పనులు చేసిపెట్టేందుకు బేరసారాలు సాగించిన సదరు అధికారిణి చివరికి కటకటాలపాలైంది.

ఏకంగా రూ.8 లక్షల డిమాండ్..

మెహదీపట్నం జీహెచ్‌ఎంసీ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తులసీరామ్‌ సునీత అవినీతి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఓ బిల్డింగ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఆమె రూ.8 లక్షలు ఇస్తేనే పని జరుగుతుందని సదరు బిల్డర్‌పై ఒత్తిడి తెచ్చింది. పైగా మున్ముందు కూడా ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకుంటానంటూ హామీ ఇచ్చింది. దీంతో సదరు బాధితుడు ఈ వ్యవహారాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.

బాధితుడి కంప్లైంట్‌తో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్ వేశారు. ముందుగా మాట్లాడుకున్న ప్రకారం ఫస్ట్ విడతగా ఖైరతాబాద్ జోనల్ ఆఫీస్ పరిసరాల్లో రూ.4 లక్షల లంచం మొత్తాన్ని బాధితుడి నుంచి తీసుకొని తన కారులో పెట్టుకుంటుండగా అధికారులు ఒక్కసారిగా చుట్టుముట్టి సునీతను అదుపులోకి తీసుకున్నారు.

కారులో మరో రూ.2.50 లక్షల సీక్రెట్ క్యాష్

సునీతను పట్టుకున్న వెంటనే ఆమె కారును చెక్ చేయగా, లంచం తీసుకున్న రూ.4 లక్షలతో పాటు ఎలాంటి లెక్కాపత్రాలు లేని మరో రూ.2.50 లక్షల నగదు బయటపడింది. దీంతో మొత్తం రూ.6.5 లక్షల నగదును ఏసీబీ టీమ్ సీజ్ చేసి ఆమెను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం డీఎస్పీ మాజిద్‌ అలీఖాన్‌ నేతృత్వంలో సునీత నివాసంలో ముమ్మరంగా సోదాలు సాగుతున్నాయి. ఆమె వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, గతంలో ఇలాంటి లంచాల దందాలు ఎన్ని నడిపారనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

#Telangana#TG News#GHMC#Greater Hyderabad Municipal Corporation#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి