సినిమా

Big Update: సల్మాన్, వంశీ పైడిపల్లి సినిమాలో ఐశ్వర్య రాయ్?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Big Update: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సల్మాన్‌ను వంశీ పైడిపల్లి ఏ తరహా పాత్రలో చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.

Big Update: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సల్మాన్‌ను వంశీ పైడిపల్లి ఏ తరహా పాత్రలో చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూడా నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సల్మాన్‌కు జోడీగా ఐశ్వర్య రాయ్?

సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ కాంబినేషన్‌కు బాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు, వారి వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన వార్తలు అప్పట్లో భారీగా చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న సల్మాన్ సినిమా కోసం ఐశ్వర్య రాయ్‌ను కీలక పాత్రలో తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం నడుస్తోంది. కథ..అందులో తన పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను వివరించేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నాడట. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

హీరోయిన్‌గా నయనతార:

ఇప్పటికే, ఈ సినిమాలో సల్మాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార ఫిక్సైంది. దిల్ రాజు నిర్మాణంలో నిర్మితమవుతోన్న 63వ సినిమా ఇది. కీలక పాత్రల్లో అనిల్ కపూర్, అరవింద స్వామీ, జాకీ ష్రాఫ్, అభిమన్యు సింగ్, రోనిత్ రాయ్, తదితరులు నటిస్తున్నారు. ఇక, ఈ సినిమా తెలుగులో రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ ధృవ సినిమాకి రీమేక్ అని తెలుస్తోంది. ఇదే సినిమా ముందు తమిళంలో తని ఒరువన్ పేరుతో వచ్చి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. కాగా, ఇందులో మాజీ ప్రపంచ సుందరి నటించే విషయం ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

#Aishwarya Rai#Salman Khan#Vamshi Paidipally#Dil Raju#Nayanathara#SVC 63
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి