సినిమా

Vijay Devarakonda: ప్యారడైజ్ సినిమాకి ఉన్న రేంజ్ రణబాలికి ఉంది..ఫైనల్‌గా ఏమవుతుందో!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Vijay Devarakonda: మన టాలీవుడ్‌లో కొత్త కథలు, కొత్త టేకింగ్‌తో వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా, కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమా కూడా పెద్ద స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘రణబాలి’ సినిమా గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

Vijay Devarakonda: మన టాలీవుడ్‌లో కొత్త కథలు, కొత్త టేకింగ్‌తో వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా, కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమా కూడా పెద్ద స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘రణబాలి’ సినిమా గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు ఉన్న కాన్సెప్ట్, మేకింగ్ చూస్తుంటే.. ఇటీవల ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ‘ది ప్యారడైజ్’ రేంజ్‌కు ‘రణబాలి’ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో హీరో విజయ్ దేవరకొండకి సాలీడ్ హిట్ అనేది దక్కలేదు. గత నాలుగైదేళ్ళుగా హిట్ కోసం తాపత్రయపడుతున్న ఈ రౌడీ హీరో ఆశలన్నీ ఇప్పుడు రణబాలి సినిమాపైనే పెట్టుకున్నాడు. అయితే, ఇన్ని ఫ్లాపుల్లో ఉన్నా కూడా రణబాలి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే నెలకొన్నాయి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించింది.

‘ది ప్యారడైజ్’ సినిమాతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. కథను చెప్పే విధానం, పాత్రల డిజైన్, రా అండ్ ఇంటెన్స్ ట్రీట్‌మెంట్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా కథను ప్రజెంట్ చేయడం ‘ప్యారడైజ్’కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. కానీ, కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులు అర్థం చేసుకోకపోవడం వల్ల ఫలితం కాస్త బెడిసికొట్టింది.

ఇప్పుడు ‘రణబాలి’ కూడా ఇదే తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఇటీవల వచ్చిన టీజర్ చూస్తే కనిపిస్తోంది. టైటిల్ నుంచే సినిమాలో ఉండబోయే యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. పీరియాడిక్ సినిమా అన్నప్పుడు, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే రూపొందించాలి. ప్రతీ సన్నివేశం ఆసక్తికరంగా మలుస్తూ..అర్థం అయ్యేలా స్క్రీన్ ప్లేలో చెప్పాలి. మరీ, ఎక్కువ కన్‌ఫ్యూజన్ ఉన్నా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోవచ్చు.

అయితే, ముందు నుంచి ది ప్యారడైజ్ సినిమాపై కొంత నెగిటివిటీ ఉన్నప్పటికీ నాని చేస్తున్న వరుస సినిమాల వల్ల ఊహించని స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. డే 1లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అదే, క్రేజ్ ఇప్పుడు విజయ్ చేస్తున్న రణబాలి మూవీకి కనిపిస్తోంది. ఓపెనింగ్స్ వరకూ ఎలాంటి డోకా లేదు. కానీ, మొదటి షోతో సినిమా టాక్ గనక పాజిటివ్ వస్తే లెక్కలన్నీ మారిపోతాయి. లేదంటే..నాని మాదిరిగా విజయ్ కూడా ట్రోల్స్ ఎదుర్కోక తప్పదు. చూడాలి, మరి ఏం జరుగుతుందో.

#Vijay Devarakonda#Ranabaali#Rashmika Mandanna#Rahul Sankrityan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి