సినిమా

Puri Jagannadh: పూరి జగన్నాధ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలను మాస్‌ ప్రేక్షకులకి మరింత దగ్గర చేసిన దర్శకుల్లో పూరి జగన్నాధ్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హీరో పాత్రను సరికొత్తగా డిజైన్ చేయడం, పవర్‌ఫుల్ డైలాగ్స్, వేగవంతమైన కథనం, మాస్ ఎలిమెంట్స్‌తో సినిమాను నడిపించడం పూరి స్టైల్. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన ఈ దర్శకుడు.. ప్రస్తుతం మాత్రం తన కెరీర్‌లో కాస్త డౌన్‌ఫాల్‌ను ఎదుర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే ప్రశ్నపై ఉంది.. పూరి జగన్నాధ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా?

పూరి జగన్నాధ్ కెరీర్‌ను పరిశీలిస్తే ఆయన దర్శకత్వంలో పనిచేసిన ఎంతోమంది హీరోలకు గుర్తుండిపోయే విజయాలు దక్కాయి. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో పూరి మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హీరోను కేవలం మంచివాడిగా కాకుండా.. లోపాలు, కోపం, యాటిట్యూడ్, బలమైన వ్యక్తిత్వంతో కూడిన పాత్రగా చూపించడం ఆయన ప్రత్యేకత.

బ్రది, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, బిజినెస్‌మ్యాన్, టెంపర్ వంటి సినిమాలు పూరి జగన్నాధ్‌కి దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ముఖ్యంగా పోకిరి తర్వాత తెలుగు కమర్షియల్ సినిమాలపై పూరి ప్రభావం బాగా కనిపించింది. దాదాపు, తెలుగు సినిమా చరిత్రలో ఉన్నటువంటి 75 ఏళ్ళ రికార్డ్స్‌ను పోకిరి సినిమాతో బ్రేక్ చేశాడు. ఇక్కడే, పూరి జగన్నాధ్‌కి సమస్యలు కూడా సవాళ్ళుగా మారాయి. పోకిరి రేంజ్ హిట్ ప్రతీ సినిమాతో దక్కలేదు. ఏ సినిమా చేసినా..ప్రేక్షకులు పోకిరి సినిమాను మించి ఆశించారు. దాంతో, ఆయనకి గురి తప్పింది. వరుసగా ఫ్లాప్స్ పడ్డాయి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీతో సాలీడ్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

మళ్ళీ, అదే స్థాయిలో సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. హీరోల జీవితాలనే మార్చేసిన పూరి..ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తో స్లమ్ డాగ్ 33: టెంపుల్ రోడ్ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌లో ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్..ఇటీవల వచ్చిన జరీనా వాహబ్ పాత్ర టీజర్ మంచి అంచనాలను పెంచింది. మరి, పూరికి ఈ సినిమాతోనైనా ఆశించిన విజయం దక్కుతుందా లేదా చూడాలి.

#Puri Jagannadh#Vijay Sethupathi#Slum Dog 33: Temple Road#Samyuktha#Tabu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి