ఏపీ

AP: ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్.. స్థానికతపై కీలక ఉత్తర్వులు!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

AP: ఆంధ్రప్రదేశ్‌లోని టీచర్లకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉపాధ్యాయుల సర్వీసులు, పదోన్నతులు, ట్రాన్స్‌ఫర్ల విషయంలో ఎప్పటినుంచో నలుగుతున్న స్థానికత సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం తాజాగా అధికారిక ఆర్డర్స్ రిలీజ్ చేసింది.

AP: ఆంధ్రప్రదేశ్‌లోని టీచర్లకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉపాధ్యాయుల సర్వీసులు, పదోన్నతులు, ట్రాన్స్‌ఫర్ల విషయంలో ఎప్పటినుంచో నలుగుతున్న స్థానికత సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం తాజాగా అధికారిక ఆర్డర్స్ రిలీజ్ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025ను బేస్ చేసుకుని విద్యాశాఖలో వర్క్ చేస్తున్న దాదాపు 1.70 లక్షల మంది టీచర్ల కేడర్‌ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

జిల్లా పరిధిలోనే SGTలు, స్కూల్ అసిస్టెంట్లు

తాజా రూల్స్ ప్రకారం.. రాష్ట్రంలోని సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు ఇకపై పక్కాగా జిల్లా కేడర్ పరిధిలోనే కొనసాగుతారు. ప్రభుత్వ తాజా స్టెప్‌తో సుమారు లక్ష మంది ఎస్జీటీలకు, 70 వేల మంది వరకు ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు తమ సొంత జిల్లాల పరిధిలోనే పోస్టింగులు, ప్రమోషన్లు దక్కే రూట్ క్లియర్ అయింది. రాబోయే రోజుల్లో చేపట్టే సాధారణ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో ఈ ఉత్తర్వులే ప్రామాణికంగా మారనున్నాయి.

రెండు ప్రత్యేక జీవోలు జారీ

ఉపాధ్యాయుల కేడర్ విభజనలో ఎలాంటి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ప్రభుత్వం రెండు వేర్వేరు జీవోలను తీసుకొచ్చింది. జీవో నంబర్ 201 ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో డ్యూటీలు చేసే 27 రకాల టీచర్ పోస్టులను జిల్లా కేడర్‌గా తేల్చారు. అలాగే జీవో నంబర్ 202 ప్రకారం.. మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూళ్లలోని 23 కేటగిరీల ఉపాధ్యాయులను జిల్లా కేడర్ పరిధిలోకి చేర్చారు.

హెడ్ మాస్టర్లకు జోనల్ కేడర్

స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలను జిల్లా కేడర్‌గా ఉంచిన ప్రభుత్వం.. ఉన్నత పాఠశాలల్లో పనిచేసే గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను మాత్రం జోనల్ కేడర్‌గా ఫైనల్ చేసింది. ప్రభుత్వ, ఎంపీపీ, జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం పోస్టుల భర్తీ, ప్రమోషన్లు ఇకపై జోన్ల వారీగా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. సర్వీస్ నిబంధనలు, కేడర్ విషయంలో ఏళ్ల తరబడి నెలకొన్న అయోమయానికి చెక్ పడటంతో ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

#AP Teachers#Andhra Pradesh Teachers#AP Education Department#Teacher Locality#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి