సినిమా

RC 17: రామ్ చరణ్, సుకుమార్ ఆరీ 17 సినిమాకి డెడ్ లైన్..కేవలం 12 నెలల్లో పూర్తి చేస్తారా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

RC 17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటేనే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘రంగస్థలం’ తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతుండటంతో ఆర్‌సీ17పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

RC 17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటేనే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘రంగస్థలం’ తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతుండటంతో ఆర్‌సీ17పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాను కేవలం 12 నెలల్లో పూర్తి చేయాలనే డెడ్‌లైన్‌తో టీమ్ ముందుకు వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది.

‘రంగస్థలం’తో రామ్ చరణ్ కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమాను అందించిన సుకుమార్.. ఇప్పుడు మరోసారి చరణ్‌తో కలిసి పనిచేయబోతున్నారు. ఈసారి కూడా కథ, క్యారెక్టరైజేషన్, టేకింగ్ విషయంలో సుకుమార్ తనదైన మార్క్ చూపించబోతున్నారనే అంచనాలు ఉన్నాయి. ఈ దసరా పండుగ సందర్భంగా ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ‘రంగస్థలం’ తర్వాత వీరి కాంబినేషన్‌పై అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఆర్‌సీ17 అనౌన్స్‌మెంట్ నుంచే సినిమాపై భారీ ఆసక్తి ఏర్పడింది.

12 నెలల్లోనే పూర్తి చేయాలనే టార్గెట్?

సుకుమార్ సినిమాలు అంటే సాధారణంగా ఎక్కువ సమయం తీసుకునే ప్రాజెక్టులనే అభిప్రాయం ఉంది. కథపై, నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై, ప్రతి సన్నివేశం మేకింగ్‌పై ఆయన ఎంతో శ్రద్ధ పెట్టడం ఇందుకు ప్రధాన కారణం. అయితే, ఆర్‌సీ17 విషయంలో మాత్రం వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని టీమ్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

దాదాపు 12 నెలల్లో షూటింగ్‌తో పాటు కీలక నిర్మాణ పనులను పూర్తి చేయాలనే డెడ్‌లైన్‌ను పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే సుకుమార్ కెరీర్‌లోనే ఇది వేగంగా పూర్తయ్యే సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఇక, ఈ సినిమా సక్సెస్ అనేది చరణ్‌కి చాలా ముఖ్యం. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ సాలీడ్ హిట్ దక్కలేదు. పెద్ది రిలీజైయ్యాక ఇండస్ట్రీ హిట్ అనుకున్నారు. కానీ, నిర్మాతకి నష్టాలను మిగిల్చింది.

#RC 17#Sukumar#Ram Charan#Mythri Movie Makers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి