Hanuman Ansh: టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకే కాదు.. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వస్తున్న పాన్ ఇండియా చిత్రాలపై కూడా సినీ లవర్స్‌లో భారీ ఆసక్తి నెలకొంటోంది. ముఖ్యంగా, ఈ మధ్య కాలంలో వస్తోన్న పురాణాలు, దైవాంశాలతో ముడిపడిన కథలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో..ఇటీవుల బాలీవుడ్ లో వచ్చి భారీ హిట్ సాధించి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ‘హనుమాన్ అంశ్’ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ హక్కులను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దక్కించుకునే అవకాశం ఉందనే ప్రచారం గతంలో వినిపించింది. వాస్తవానికి, ప్రకటన కూడా చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంథలు కలిసి తెలుగులో రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ, ఎందుకనో వీరి డ్రాపయ్యారు. అయితే, తాజాగా ఈ సినిమా తెలుగు హక్కులు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. దీంతో త్రివిక్రమ్ ఈ డీల్‌ను మిస్ చేసుకున్నారనే చర్చ మొదలైంది. త్వరలో, వీరు తెలుగులో రిలీజ్ చేయనున్నారు.
కన్నడ బ్లాక్ బస్టర్ అయిన కేజీఎఫ్, కాంతార వంటి భారీ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్.. ఇప్పుడు ‘హనుమాన్ అంశ్’ తెలుగు మార్కెట్‌పై దృష్టి పెట్టడం ఆసక్తిని పెంచుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సంస్థ రైట్స్‌ను దక్కించుకుంది. హనుమంతుడి అంశంతో ముడిపడిన కథ కావడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి ఏర్పడింది. దీనికి హోంబలే ఫిల్మ్స్‌కు ఉన్న పాన్ ఇండియా బ్రాండ్ ఇమేజ్ కూడా కలిసొస్తుంది. కాబట్టి, గ్యారెంటీగా తెలుగులో మ్యాజిక్ ఫిగర్స్ నమోదు చేసే అవకాశం ఉంది.
‘హనుమాన్ అంశ్’ తెలుగు హక్కుల విషయంలో త్రివిక్రమ్ పేరు వినిపించడం ఆసక్తికరంగా మారింది. అయితే, చివరి దశలో డీల్ కుదరకపోవడానికి అసలు కారణం ఏమిటన్నది మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. బిజినెస్ లెక్కలు, రిలీజ్ ప్లాన్ లేదా ఇతర కారణాల వల్ల ఈ డీల్ త్రివిక్రమ్ చేతుల నుంచి జారిపోయి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ ఓ సినిమా తెలుగు హక్కులను దక్కించుకునే ప్రయత్నం చేశారన్న వార్తే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది. ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ ఆ హక్కులను దక్కించుకోవడంతో సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.


