తెలంగాణ

Auto Fares Hike: ప్రయాణికులకు షాక్.. భారీగా ఆటో ఛార్జీలు పెంపు

రచన: NK••6 నిమిషాల పఠనం

Auto Fares Hike: రాష్ట్రంలో ఆటో రిక్షా ఛార్జీలను సవరించింది ప్రభుత్వం. కొత్త ఛార్జీలను ఖరారు చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 46 జారీ చేసింది. కొత్త ఛార్జీల ప్రకారం కనీస ఛార్జీని 30 రూపాయలుగా నిర్ణయించారు. తొలి 1.6 కిలోమీటర్లకు ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు 14 రూపాయలు చొప్పున వసూలు చేయనున్నారు. వెయిటింగ్ ఛార్జీ (ప్రయాణికుల కోసం వేచి ఉండే ఛార్జీ) నిమిషానికి 75 పైసలుగా ఖరారు చేశారు.

Auto Fares Hike: రాష్ట్రంలో ఆటో రిక్షా ఛార్జీలను సవరించింది ప్రభుత్వం. కొత్త ఛార్జీలను ఖరారు చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 46 జారీ చేసింది. కొత్త ఛార్జీల ప్రకారం కనీస ఛార్జీని 30 రూపాయలుగా నిర్ణయించారు. తొలి 1.6 కిలోమీటర్లకు ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు 14 రూపాయలు చొప్పున వసూలు చేయనున్నారు. వెయిటింగ్ ఛార్జీ (ప్రయాణికుల కోసం వేచి ఉండే ఛార్జీ) నిమిషానికి 75 పైసలుగా ఖరారు చేశారు.

రాత్రి 50శాతం అదనపు ఛార్జీలు

అలాగే రాత్రి సమయ ఛార్జీలను కూడా సవరించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ ఛార్జీపై ఒకటిన్నర రెట్లు అంటే 50శాతం అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. సూట్ కేస్, హ్యాండ్ బ్యాగ్ మినహా ఇతర ప్యాకేజీలపై ప్రతి కిలోమీటర్ కు 50 పైసల ఛార్జీ నిర్ణయించారు. లగేజీ గరిష్ట పరిమితిని 100 కిలోలుగా నిర్ధారించారు.

మూడు నెలల సమయం

కొత్త ఛార్జీలకు అనుగుణంగా డిజిటల్ మీటర్లు సవరించేందుకు గాను ఆటో డ్రైవర్లకు మూడు నెలల గడువు ఇచ్చారు. ఈలోగా పాత, కొత్త ఛార్జీల వివరాలతో ఫేర్ కార్డులను ఆటోల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గత కొంత కాలంగా ఆటో రిక్షా కార్మికులు చేస్తున్న డిమాండ్లపై స్పందించిన ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టం ప్రకారం కొత్త టారిఫ్ ఖరారు చేసింది. ఇప్పటివరకు 1.6 కిలోమీటర్లకు 20 రూపాయలు ఛార్జీ వసూలు చేస్తుండగా.. దాన్ని 30 రూపాయలకు పెంచారు. ఇప్పటివరకు కనీస ఛార్జీ తర్వాత ప్రతి కిలోమీటరుకు 11 రూపాయలు చొప్పున వసూలు చేసేవారు. దాన్నిప్పుడు 14 రూపాయలకు పెంచారు.

14ఏళ్ల తర్వాత ఆటో ఛార్జీలు పెంపు

కాగా.. 14ఏళ్ల తర్వాత ఆటో ఛార్జీలను సవరించడం జరిగింది. చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో 2012లో ఆటో ఛార్జీలను సవరించారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో రిక్షా ఛార్జీలను సవరించింది. ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులు, వాహనాల కొనుగోలు వ్యయం, డ్రైవర్ల జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఛార్జీలు పెంపును సిఫారసు చేస్తూ ప్రభుత్వ నియమించిన కమిటీ నివేదిక సమర్పించింది. ఈ సిఫారసుల మేరకు ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఆటో రిక్షా కార్మికులను నొప్పించకుండా ఛార్జీలను సవరించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ఆటో డ్రైవర్ల అసంతృప్తి

ఆటో ఛార్జీల పెంపు పట్ల ఆటో డ్రైవర్ల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస ఛార్జీ 40 రూపాయలు చేయాలని తాము డిమాండ్ చేశామని, కానీ ప్రభుత్వం 30 రూపాయలుగా నిర్ణయించిందని ఆటో డ్రైవర్లు వాపోయారు. ఇది కొంత బాధాకరం అన్నారు. కనీస ఛార్జీ తర్వాత ప్రతి కిలోమీటర్ కు కనీసం 16 రూపాయలుగా ఛార్జీని పెంచుతారని ఆశించామన్నారు.

కానీ ప్రభుత్వం ఏకపక్షంగా కిలోమీటర్ కు 14 రూపాయలు, 30 రూపాయలు మినిమం ఛార్జీగా ప్రకటించిందన్నారు. ఆటో డ్రైవర్ల శ్రేయస్సు దృష్ట్యా ఛార్జీలను ఇంకొంత పెంచి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సవరించిన రేట్లతో తమకు గిట్టుబాటు కాదన్నారు. అసంతృప్తిగానే ప్రభుత్వ పెంచిన ఛార్జీలతో అంగీకరిస్తున్నామన్నారు.

#Auto Fares Hike#Telangana Govt#Auto Charges#Revise#Minimum Fare#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి