తెలంగాణ

Land Grab: తుమ్మలూరులో రూ.300కోట్ల విలువైన భూమి కబ్జాయత్నం? ఎమ్మెల్యేపై NHRCకి ఫిర్యాదు

రచన: NK•••5 నిమిషాల పఠనం

Land Grab: ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో భూ కబ్జా యత్నం ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. సర్వే నంబర్లు 371, 372, 373, 377లో మొత్తం 51.02 ఎకరాల భూమికి సంబంధించి అక్రమంగా హక్కులు సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బాధిత రైతులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

* తుమ్మలూరులో రూ.300 కోట్ల విలువైన 51 ఎకరాల భూమిపై కబ్జాయత్నం ఆరోపణలు

* తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ప్రైవేట్ సంస్థలు, రెవెన్యూ అధికారులపై NHRCకి రైతుల ఫిర్యాదు

* ఫిర్యాదుపై విచారణకు ఆదేశించిన NHRC

* 4 వారాల్లో విచారణ నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారికి ఆదేశం

Land Grab: ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో భూ కబ్జా యత్నం ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. సర్వే నంబర్లు 371, 372, 373, 377లో మొత్తం 51.02 ఎకరాల భూమికి సంబంధించి అక్రమంగా హక్కులు సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బాధిత రైతులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

ఈ భూముల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని రైతులు పేర్కొన్నారు. తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు JB Infra, Concrete Infra, Bhuvana Infra తదితర సంస్థలు/వ్యక్తుల ప్రమేయంపై సమగ్ర విచారణ జరపాలని రైతులు కోరారు.

రెవెన్యూ రికార్డుల్లో కీలక అంశాలు

రైతులు సమర్పించిన పత్రాల్లో తుమ్మలూరు సర్వే నంబర్లు 371, 372, 373, 377కు సంబంధించి గద్దగూటి యెల్లయ్యకి Protected Tenancy హక్కులు ఉన్నాయని.. పాత పహాణీలు, Protected Tenancy Register వంటి రికార్డుల్లో కూడా అవి క్లుప్తంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, మహేశ్వరం తహసీల్దార్ 12-03-2026న B/123/2026 ఫైల్‌లో ఇచ్చిన నివేదికలో గద్దగూటి యెల్లయ్యకు సంబంధించి 371, 372, 373, 377లో Protected Tenancy హక్కులు సరెండర్ అయినట్లు నిర్దిష్ట రికార్డు లేదని పేర్కొన్నారని ఫిర్యాదుదారు తెలిపారు.

అదే ఫైల్‌లో 30-03-2026న మరో నివేదిక ఇవ్వబడిందని, అందులో గత నివేదికకు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారని రైతులు అభ్యంతరం తెలిపారు. ఈ రెండు నివేదికలు ఎలా వచ్చాయి? ఏ ఆధారాలతో రెండో నివేదిక ఇచ్చారు? అసలు రికార్డులు ఏం చెబుతున్నాయి? అనే అంశాలపై స్వతంత్ర విచారణ జరపాలని వారు కోరుతున్నారు.

న్యాయం చేయాలని డిమాండ్

తుమ్మలూరులోని రైతుల భూములపై తప్పుడు పత్రాలు, విరుద్ధమైన రెవెన్యూ నివేదికలు లేదా అధికార దుర్వినియోగం ద్వారా హక్కులు సృష్టించే ప్రయత్నం జరిగిన అంశంపై సమగ్ర అధికారిక విచారణ జరపాలని, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశాల ప్రకారం నిష్పక్షపాతంగా విచారణ జరిగి వాస్తవాలు బయటకు రావాలని రైతులు కోరుతున్నారు. అలాగే విచారణలో అధికార దుర్వినియోగం చేసినట్లు తేలిన రెవెన్యూ అధికారులపై, తప్పుడు పత్రాలతో వెంచర్ చేస్తున్నట్లు తేలిన సంబంధిత వ్యక్తులు/సంస్థలపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుని, బాధిత రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Land Grab: తుమ్మలూరులో రూ.300కోట్ల విలువైన భూమి కబ్జాయత్నం? ఎమ్మెల్యేపై NHRCకి ఫిర్యాదు

#Land Grab#Ranga Reddy Dist#Tummaloor Village#Maheswaram Mandal#Mla Manohar Reddy#Tandur#Swechaa News#Land Grabbing
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి