వ్యాపారం

పండుగ వేళ సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గనున్న చక్కెర ధరలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

దేశంలో రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజలకు నిత్యావసరాల ధరల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పండుగల సమయంలో మార్కెట్‌లో చక్కెర కృత్రిమ కొరత ఏర్పడకుండా నిరోధించడం, వినియోగదారులకు సరసమైన ధరలకే అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా పంచదార నిల్వలపై (Sugar Stock Limits) నూతన నిబంధనలను విధించింది.

 దేశంలో రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజలకు నిత్యావసరాల ధరల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పండుగల సమయంలో మార్కెట్‌లో చక్కెర కృత్రిమ కొరత ఏర్పడకుండా నిరోధించడం, వినియోగదారులకు సరసమైన ధరలకే అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా పంచదార నిల్వలపై (Sugar Stock Limits) నూతన నిబంధనలను విధించింది.

 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, డీలర్లు తమ వద్ద ఉన్న నిల్వలను గరిష్టంగా 15 రోజుల్లోగా విక్రయించాల్సి ఉంటుంది. నూతన నిబంధనల ప్రకారం.. సాధారణ ప్రాంతాల్లోని డీలర్లు తమ గోదాముల్లో గరిష్టంగా 1,000 క్వింటాళ్ల పంచదారను మాత్రమే నిల్వ ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే రవాణా సౌకర్యాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కోల్‌కతా, దాని పరిసర ప్రాంతాలు, అస్సాం రాష్ట్రాలకు 2,000 క్వింటాళ్ల వరకు నిల్వ ఉంచుకునే మినహాయింపు కల్పించారు.

 అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, ధరల కృత్రిమ పెంపునకు చెక్ పెడుతూ షుగర్ మిల్లుల నుంచి నేరుగా వినియోగదారులకు ఎలాంటి విఘాతం కలగకుండా నిరంతర సరఫరా జరిగేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఆగస్టు నెల గరిష్ట స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్త రిటైల్ మార్కెట్లో పంచదార ధరలు దాదాపు 15 శాతం వరకు తగ్గుముఖం పట్టగా, మిల్లుల వద్ద ధరలు సుమారు 28 శాతం మేర పడిపోయాయి.

 ఈ తగ్గింపు ప్రయోజనాలను హోల్‌సేలర్లు, రిటైలర్లు వెంటనే సామాన్య వినియోగదారులకు బదిలీ చేయాలని కేంద్రం ఆదేశించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త షుగర్ క్రషింగ్ సీజన్ ప్రారంభం కావడంతో మిల్లులు వెంటనే చెరకు క్రషింగ్ పనులను వేగవంతం చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే వినియోగదారు ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రాధాన్యత అని ప్రభుత్వం వెల్లడించింది.

#SugarPricesDrop#FestiveSeasonOffers#SugarStockLimits#UnionGovernment#ConsumerRelief#EssentialCommodities#IndiaBusinessNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి