Tollywood: మన టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలతో మాత్రమే బిజీగా గడపడం లేదు. ప్రేక్షకులను అలరించినేందుకు ఇతర ఎంటర్‌టైంగ్ మార్గాలను ఎంచుకుంటున్నారు. వీటిలో రియాలిటీ షోస్, హోస్ట్‌గా సెలబ్రిటీ టాక్ షోస్ వంటివి ఒప్పుకుంటున్నారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలే కాదు, మన సౌత్ అండ్ నార్త్ స్టార్స్ కూడా ఇలాంటి రియాలిటీ షోస్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్నారు.
ప్రస్తుతం, మన తెలుగులో ఎవరెవరు ఏ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారో చూద్దాం..
కింగ్ నాగార్జున గత కొన్నేళ్ళ నుంచి బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రక రకాల టాస్కులతో కంటెస్టెంట్లను అల్లాడిస్తున్నారు. అన్నీ భాషలలో బిగ్ బాస్ రియాలిటీ షోకి మంచి ఆదరణ దక్కుతోంది. అలాగే, బాలయ్య కూడా అన్‌స్టాపబుల్ షో తో ఆకట్టుకుంటున్నారు. వరుస సీజన్స్‌తో ఆహా ఎంతో గ్రాండ్‌గా నిర్వహిస్తున్న ఈ షో కి ఫ్యాన్స్‌లో విపరీతమైన ఆదరణ దక్కుతోంది.
హనుమాన్, మిరాయ్ లాంటి సినిమాలతో యువ నటుడు తేజ సజ్జా బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. మిగతా హీరోలా ఫక్తు కమర్షియల్ సినిమాలు కాకుండా కాస్త మైథలాజికల్ టచ్ ఉన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గ్రాఫ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే, సినిమా సినిమాకి బాగా గ్యాప్ రావడంతో ఒక టాక్ షోను కమిటైయ్యాడు. 'ది ట్రైటర్స్'.. అనే టాక్ షో త్వరలో ప్రారంభం కాబోతోంది.
మెగాస్టార్ చిరంజీవి కూడా నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ సెలబ్రిటీ టాక్ షో చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, సుస్మిత కొణిదెల పర్యవేక్షణలో రచయిత బివిఎసెన్ రవి కంటెంట్‌తో ఈ టాక్ మొదలవబోతుందట. అంతేకాదు, 200 కోట్ల భారీ రెమ్యునరేషన్ కూడా చిరుకు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలో, దీనిపై అధికారికంగా ప్రకటన రానుంది. ఇలా, తారక్, రానా దగ్గుబాటి లాంటి వారు హోస్ట్ గా అలరించారు. నేచురల్ స్టార్ నానీ కూడా బిగ్ బాస్ ఒక సీజన్‌కి హోస్ట్‌గా ఆకట్టుకున్నాడు.


