Tollywood: హీరోయిన్ అన్న తర్వాత సక్సెస్ మాత్రమే ప్రధానం. హిట్ కొట్టినప్పుడే హీరోయిన్ కి ఛాన్సులు వస్తుంటాయి. అలా, వచ్చినప్పుడే చక చకా సినిమాలను ఒప్పుకుంటారు. సినిమా హిట్ అయితేనే లక్కీ హీరోయిన్ అంటారు. అదే సినిమా ఫ్లాపైతే ఐరెన్ లెగ్ అంటారు. అందుకే, ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కి స్పాన్ చాలా తక్కువ. కేజీఎఫ్ తర్వాత కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ సమయంలో వరుసగా ఆఫర్స్ వచ్చాయి.
కానీ, శ్రీనిధి మాత్రం దాదాపు 10 సినిమాలకి పైగానే ఆఫర్స్ వచ్చాయట. అయితే, వచ్చిన ప్రతీ సినిమాను ఒప్పుకోలేదు. రెమ్యునరేషన్ బాగా డిమాండ్ చేసినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చి చక్కర్లు కొట్టాయి. కానీ, అందుకు కారణం ఏంటనేది తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడింది. త్వరలో, ఈ బ్యూటీ నటించిన 'ఆదర్శ కుటుంబం' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
అక్టోబర్ 9న ఆదర్శ కుటుంబం రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో వెంకటేష్, త్రివిక్రమ్ తో కలిసి శ్రీనిధి ఇంటర్వ్యూస్ ఇస్తోంది. ఈ సందర్భంగా శ్రీనిధి..ఎందుకు వరుసగా సినిమాలు ఒప్పుకోవడం లేదో క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో తనకి ఆఫర్స్ రావడం లేదని, అందుకే..వెంకీ లాంటి సీనియర్ హీరోతో నటించడానికి ఒప్పుకుందని ప్రచారం అవుతోంది.
అయితే, ఈ వార్తలపై స్పందించిన శ్రీనిధి..వచ్చిన ప్రతీ సినిమాను ఒప్పుకొని..ఫ్లాపులను మూటగట్టుకునేకంటే..మంచి కథలను ఎంచుకొని ఇండస్ట్రీలో లాంగ్ టైమ్ ఉండాలనే ఆలోచనతోనే చాలా సెలెక్టెడ్‌గా మంచి సినిమాలను ఎంచుకుంటున్నట్టుగా వెల్లడించింది. అలాంటి ఆలోచనతోనే వెంకీ సినిమాకి సైన్ చేశానని..చెప్పింది. త్రివిక్రమ్ లాంటి దర్శకుడి సినిమా అంటే హీరోయిన్‌కి ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుందనే ఆదర్శ కుటుంబం ఒప్పుకున్నట్టుగా వెల్లడించింది. అమ్మడి, ఆలోచన ఇదే అయితే ఖచ్చితంగా ఇండస్ట్రీలో కొంతకాలం కొనసాగుతుంది.


