క్రీడలు

Ind Vs Zim: రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

రచన: NK3 నిమిషాల పఠనం

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లోనూ భారత్ దుమ్మురేపింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. ఏకంగా 90 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇషాన్ 44 బంతుల్లో 81 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 60 రన్స్ బాదాడు. వైభవ్ సూర్యవన్షీ 20 పరుగులు, కెప్టెన్ శ్రేయర్ అయ్యర్ 25 రన్స్ చేశారు.

Ind Vs Zim: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లోనూ భారత్ దుమ్మురేపింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. ఏకంగా 90 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇషాన్ 44 బంతుల్లో 81 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 60 రన్స్ బాదాడు. వైభవ్ సూర్యవన్షీ 20 పరుగులు, కెప్టెన్ శ్రేయర్ అయ్యర్ 25 రన్స్ చేశారు.

220 రన్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. 17.5 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లతో చెలరేగాడు. యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు.

రవి బిష్ణోయ్, తిలక్ వర్మ, దూబే చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ టీ20 సిరీస ను కైవసం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్ గా ఇదే తొలి సిరీస్ గెలుపు. ఐర్లాండ్, ఇంగ్లండ్ తో జరిగిన టీ20 సిరీస్ లలో అయ్యర్ కెప్టెన్సీలో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

#Ind Vs Zim#India#2nd T20I#Harare#Zimbabwe#Shreyas Iyer
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి