AP Corona Cases: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం రోజు ఏకంగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరులో 3 కేసులు వెలుగుచూశాయి. ఎన్టీఆర్ జిల్లాలో 2 కేసులు బయటపడ్డాయి. అల్లూరి, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49కి పెరిగింది. 24 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 16 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా, ఇతర కారణాలతో నలుగురు మరణించారు.
కరోనా మహమ్మారి ప్రజలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. కోవిడ్ వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను టెన్షన్ పెడుతోంది. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అంటోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని చెప్పింది.












