National

Rahul Gandhi: మోదీ ప్రభుత్వానికి ఇదొక మేలుకొలుపు, నేటి యువత చూస్తూ ఊరుకోదు- రాహుల్ గాంధీ

రచన: NK5 నిమిషాల పఠనం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఇదొక మేలుకొలుపు అని రాహుల్ అన్నారు. వ్యవస్థను నాశనం చేస్తే నేటి యువత చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళలు ఉధృతం కావడానికి ప్రధాని మోదీనే కారణం అని రాహుల్ ఆరోపించారు. ప్రధాని సాగదీత ధోరణే ఈ ఆందోళనకు ప్రధాన కారణం అన్న రాహుల్.. విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Rahul Gandhi: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఇదొక మేలుకొలుపు అని రాహుల్ అన్నారు. వ్యవస్థను నాశనం చేస్తే నేటి యువత చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళలు ఉధృతం కావడానికి ప్రధాని మోదీనే కారణం అని రాహుల్ ఆరోపించారు. ప్రధాని సాగదీత ధోరణే ఈ ఆందోళనకు ప్రధాన కారణం అన్న రాహుల్.. విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

''విద్యా వ్యవస్థలోకి ఆర్ఎస్ఎస్ దొడ్డిదారిన చొరబడింది. మొత్తం విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ చెరబట్టింది. దేశంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నింటికీ ప్రధాన కారణం మోదీ. ప్రధాని సాగదీత ధోరణే యువత ఆందోళనకు ప్రధాన కారణం. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. దేశంలో మీడియా, విద్య, సమాఖ్య వ్యవస్థలు గాడి తప్పాయి. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది'' అని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.

''మన విద్యావ్యవస్థ గొప్పదని ప్రపంచమంతా పేరుంది. అలాంటి విద్యావ్యవస్థను క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. నిరుద్యోగం పెరగడంతో యువత ఆగ్రహంతో ఉన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని యువత కోరుకుంటోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై దాడులకు దిగారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వల్లే విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారింది. వ్యవస్థలో మార్పులు రావాలని యువత కోరుకుంటోంది. వ్యవస్థలు నాశనం చేస్తే నేటి యువత చూస్తూ ఊరుకోదు. ప్రజల ఆకాంక్షల మేరకు పాలకులు ప్రవర్తించాలి'' అని రాహుల్ గాంధీ అన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉందని రాహుల్.. దేశాన్ని, వ్యవస్థలను నడిపే తీరు ఇది కాదని ధ్వజమెత్తారు. విద్యార్థుల ఆందోళనలు దేశంలో ఉన్న తీవ్రమైన సంక్షోభానికి నిదర్శనం అన్నారు. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం పతాకస్థాయికి చేరాయన్నారు. సంక్షోభాలను పరిష్కరించే వరకు కాంగ్రెస్ ఆందోళన కొనసాగిస్తుందని తేల్చి చెప్పారు. విద్యార్థులపై జరిపిన అణిచివేతను సోమవారం పార్లమెంటులో ప్రశ్నిస్తామన్నారు. విద్యార్థులపై జరిగిన దాడులకు హోంమంత్రి అమిత్ షా బాధ్యుడు అన్న రాహుల్.. అమిత్ షా వైఖరిని పార్లమెంటులో ప్రశ్నిస్తామన్నారు.

#Rahul Gandhi#PM Modi#CJP#Cockroach Janata Party#Students Protests#NEET Paper Leak#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి