సినిమా

Prabhas: ఇంకా పెళ్లెప్పుడు ప్రభాస్..ఎలాంటమ్మాయి కావాలో చెప్పు పోనీ.!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Prabhas: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ఎవరు అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఈ డార్లింగ్.. పెళ్లి టాపిక్ మాత్రం ఎప్పటికప్పుడు సస్పెన్స్‌గానే మిగిలిపోతోంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం దొరికింది

Prabhas: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ఎవరు అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఈ డార్లింగ్.. పెళ్లి టాపిక్ మాత్రం ఎప్పటికప్పుడు సస్పెన్స్‌గానే మిగిలిపోతోంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం దొరికింది కానీ, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అనే దానికి మాత్రం ఎన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సరైన జవాబు దొరకలేదు.

గతంలో అనుష్కతో ప్రేమలో ఉన్నాడని, ఆ మధ్య కృతి సనన్‌తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని.. ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి. కృష్ణంరాజు ఉన్నప్పటి నుంచీ ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదే ఉంటుంది, వచ్చే ఏడాదే ఉంటుంది అని కుటుంబ సభ్యులు చెబుతూనే ఉన్నారు. అయినా కూడా మన డార్లింగ్ మాత్రం ఈ వార్తలపై అస్సలు స్పందించకుండా సైలెంట్‌గా తన సినిమాలేదో తాను చేసుకుపోతున్నాడు.

దీంతో అభిమానుల్లో సహనం నశించిపోతోంది. "ఇంకా ఎన్నాళ్లు ఈ వెయిటింగ్ ప్రభాస్ అన్నా.. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెబితే, మేమే వెతికి పెడతాం కదా" అని సోషల్ మీడియా వేదికగా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. పద్ధతిగా ఉండే తెలుగమ్మాయి కావాలా? లేక సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ కావాలా? అసలు నీ మనసులో ఏముంది డార్లింగ్ అంటూ నెటిజన్లు సరదాగా ప్రశ్నిస్తున్నారు.

ఓ వైపు సలార్, కల్కి 2898 ఏడీ లాంటి సెన్సేషనల్ హిట్స్.. మరోవైపు ఫౌజీ, స్పిరిట్ లాంటి క్రేజీ ప్రాజెక్టులతో కెరీర్ పరంగా ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నాడు. కానీ వ్యక్తిగత జీవితం వచ్చేసరికి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది పరిస్థితి. మ‌రి ఇప్ప‌టికైనా తనను ప్రాణంగా ప్రేమించే కోట్లాది మంది అభిమానులకు త్వరలోనే పెళ్లి కబురు చెప్పి.. మన డార్లింగ్ తన రియల్ లైఫ్ డార్లింగ్ ని పరిచయం చేయాలని ఆశిద్దాం.

#prabhas#darlingprabhas#spirit#fauzi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి