National

CJP Demands: అప్పుడే అయిపోలేదు, తొలి వికెట్ పడింది- ఉద్యమంపై సీజేపీ కీలక ప్రకటన

రచన: NK6 నిమిషాల పఠనం

తాము చేపట్టిన ఆందోళనల ఫలితంగా నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజీనామాపై స్పందించిన సీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఉద్యమం అప్పుడే అయిపోలేదని, ఇంకా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ తొలి డిమాండ్ మాత్రమే నెరవేరిందన్నారు. మిగిలిన డిమాండ్లు కూడా నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

CJP Demands: తాము చేపట్టిన ఆందోళనల ఫలితంగా నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజీనామాపై స్పందించిన సీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఉద్యమం అప్పుడే అయిపోలేదని, ఇంకా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ తొలి డిమాండ్ మాత్రమే నెరవేరిందన్నారు. మిగిలిన డిమాండ్లు కూడా నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన అన్ని కేసులు వెంటనే ఎత్తివేయాలి, నీట్ పేపర్ లీక్ తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు కూడా పూర్తయ్యే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. అంతేకాదు విద్యా వ్యవస్థలో సమగ్ర ప్రక్షాళన జరగాలన్నారు.

''ఇది మొదటి వికెట్, తొలి వికెట్ పడింది. ఇక్కడితో మేము ఆగిపోము. విద్యా వ్యవస్థలో అసలైన ప్రక్షాళన ఇప్పుడే మొదలైంది. విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేవరకు ఈ ఉద్యమం ఆగదు. మాకు రాజకీయాలు అవసరం లేదు. ధర్మేంద్ర రాజీనామా మాకు దక్కిన గొప్ప విజయం. కాక్రోచ్ లు వ్యవస్థలోని చీడ పురుగులను బయటకు పారదోలాయి. ఇది దేశ యువత, విద్యార్థులు, ప్రజాస్వామ్య విజయం'' అని సీజేపీ నేతలు చెప్పారు.

''యువత పోరాటం వృథా కాలేదు. విద్యార్థులు తమ ఐక్యతను చాటుకున్నారు. యువత సత్తాను నిరూపించుకున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలకు ఉండే పవర్ కి ఇదే నిలువెత్తు నిదర్శనం. శాంతియుతంగా సాగించే ఏ పోరాటమైనా కచ్చితంగా సఫలం అవుతుంది'' అని సీజేపీ నేతలు అన్నారు.

నీట్ పేపర్ లీక్ నుంచి ధర్మేంద్ర రాజీనామా వరకు.. అసలేం జరిగింది..

2026 మే 3న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించారు. నీట్ పేపర్ లోని కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో పరీక్షను రద్దు చేసింది కేంద్రం. నీట్ పరీక్ష రద్దుతో మనస్తాపం చెందిన పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

నీట్ పేపర్ లీకేజీతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తెరపైకి వచ్చింది. మే 16న కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేశారు అభిజీత్ దీప్కే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది సీజేపీ. అమెరికా నుంచి వచ్చి మరీ జంతర్ మంతర్ లో ఉద్యమం ప్రారంభించారు అభిజిత్ దీప్కే. జూన్ 6వ తేదీ నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది సీజేపీ. జూన్ 28న సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ దీక్ష చేపట్టారు. 26 రోజుల పాటు ఆమరణ దీక్షను కొనసాగించారు.

ఈ నెల 20న చలో పార్లమెంటు ర్యాలీతో సీజేపీ ఆందోళన పతాకస్థాయికి చేరింది. సీజేపీ ఆందోళనతో పార్లమెంటు పరిసరాలు రణరంగంగా మారాయి. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు రెండు విడతలుగా చర్చలు జరిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఉద్యమం ఆపుతామని సీజేపీ తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా ఉధృతమైన విద్యార్థుల ఆందోళనలతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.

ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి..

https://x.com/ANI/status/2080956873956872382

#Abhijeet Dipke#CJP#Cockroach Janata Party#Dharmendra Pradhan#Dharmendra Pradhan Resignation#Swechaa News#CJP Demands#NEET Paper Leak
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి