సినిమా

Directors: వీళ్ళిక వారసులను నమ్ముకుంటే బెటరేమో.!

రచన: Anshu5 నిమిషాల పఠనం

Directors: చిత్ర పరిశ్రమలో సక్సెస్ అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒకప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసి, ఇండస్ట్రీ హిట్లు కొట్టిన దిగ్గజ దర్శకులు కూడా కాలానుగుణంగా అప్ డేట్ అవ్వకపోతే వరుస పరాజయాలతో సతమతం అవ్వాల్సిందే. ప్రస్తుతం భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలు ఉన్నా కూడా కొందరు సీనియర్ డైరెక్టర్లకు ఆశించిన ఫలితాలు రావడం లేదు.

Directors: చిత్ర పరిశ్రమలో సక్సెస్ అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒకప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసి, ఇండస్ట్రీ హిట్లు కొట్టిన దిగ్గజ దర్శకులు కూడా కాలానుగుణంగా అప్ డేట్ అవ్వకపోతే వరుస పరాజయాలతో సతమతం అవ్వాల్సిందే. ప్రస్తుతం భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలు ఉన్నా కూడా కొందరు సీనియర్ డైరెక్టర్లకు ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇలాంటి తరుణంలో, తమ కెరీర్ ను తిరిగి గాడిలో పెట్టుకోవడానికి, తమ వారసులనే నమ్ముకుంటే బెటరేమో అన్న చర్చ సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సౌత్ ఇండియాను శాసించిన ఇద్దరు స్టార్ డైరెక్టర్ల పరిస్థితి చూస్తే ఇది అక్షరాలా నిజమే అనిపిస్తుంది. వాళ్లే శంకర్, పూరి జగన్నాథ్.

భారతీయ చలనచిత్ర రంగంలో విజువల్ వండర్స్ కు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ శంకర్. 'రోబో', 'శివాజీ', 'అపరిచితుడు' లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. కానీ, ఇటీవల వచ్చిన 'భారతీయుడు 2, గేమ్ ఛేంజ‌ర్‌` ఆయన కెరీర్ లోనే అత్యంత నిరాశపరిచిన చిత్రాలుగా నిలిచిపోయాయి. శంకర్ మార్క్ రైటింగ్ మిస్సయిందనే విమర్శలు తీవ్రంగా వచ్చాయి. అయితే, మరోవైపు ఆయన కుమార్తె అదితి శంకర్ మాత్రం నటిగా అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. స్టార్ డైరెక్టర్ కూతురు అనే గర్వం లేకుండా, పక్కింటి అమ్మాయి లాంటి పాత్రలతో 'విరుమన్', 'మావీరన్' (మహావీరుడు) లాంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

అదితిలో మంచి నటి మాత్రమే కాదు, అద్భుతమైన గాయని కూడా దాగుంది. ఇప్పుడు శంకర్ భారీ బడ్జెట్ సినిమాల కోసం స్టార్ హీరోల చుట్టూ తిరిగే కంటే, తన కూతురిలోని న్యాచురల్ టాలెంట్ కు సరిపోయే ఒక కంటెంట్ ఓరియెంటెడ్, ఎమోషనల్ కథను రాసుకుంటే బాగుంటుంది. అది అదితి కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడమే కాకుండా, శంకర్ కు కూడా ఒక దర్శకుడిగా తనలోని మూలాలను తిరిగి గుర్తుచేస్తుంది అప‌డంలో సందేహం లేదు.

ఇక హీరో క్యారెక్టరైజేషన్, పంచ్ డైలాగులతో టాలీవుడ్ కు కొత్త మాస్ ను పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్ పూరి జగన్నాథ్. 'పోకిరి', 'ఇడియట్', 'బిజినెస్ మేన్' లాంటి చిత్రాలతో యువతను ఉర్రూతలూగించారు. కానీ ఇప్పుడు పూరి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 'లైగర్', మొన్నటి 'డబుల్ ఇస్మార్ట్' భారీ పరాజయాలు పూరి రైటింగ్ పై తీవ్ర సందేహాలను రేకెత్తించాయి. అయితే ఆయన కొడుకు ఆకాష్ పూరిలో తండ్రికి తగ్గ యాటిట్యూడ్ పుష్కలంగా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఆకాష్, హీరోగా కూడా ('రొమాంటిక్', 'చోర్ బజార్') తన మాస్ ఎనర్జీని చూపించాడు.

కానీ సరైన డైరెక్షన్, బ్రేక్ ఇచ్చే కథ పడకపోవడంతో కెరీర్ కాస్త నెమ్మదించింది. ఇప్పుడు బయటి హీరోల చుట్టూ తిరిగి ప్రయోగాలు చేయడం కంటే, పూరి తన పెన్నుకు పదును పెట్టి, పక్కా మాస్ యాక్షన్ డ్రామాతో ఆకాష్ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తే ఎలా ఉంటుంది? తండ్రిలోని కసి, కొడుకులోని ఎనర్జీ కలిస్తే కచ్చితంగా మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. ఆకాష్ కు ఒక సాలిడ్ హిట్ పడుతుంది, పూరికి ఇజం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంద‌ని ప‌లువురు సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

#purijagannadh#shankar#adhithishankar#akashpuri
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి