Nara Rohit: నారా వారబ్బాయి రోహిత్ హీరోగా డిఫరెంట్ జోనర్ సినిమాలను చేస్తున్నాడు. బాణం నుంచి ఆయన ఎంచుకునే కథలన్నీ ఎంతో వెరైటీగా ఉంటున్నాయి. మాస్ హీరోగా క్రేజ్ సంపాదించుకోవాలనే ఆతృత రోహిత్ కి లేదు. అందుకే, స్లో అండ్ స్టడీ అన్నట్టుగా ఒక్కో సినిమాను చేస్తూ వస్తున్నాడు. ఈరోజు నారా రోహిత్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల అప్‌డేట్స్ వరుసగా వస్తున్నాయి. హీరోగా నటిస్తూనే, కీలక పాత్రలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్, విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ నుంచి తాజాగా లుక్ రివీల్ అయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఆదర్శ కుటుంబం’ రూపొందుతోంది.
ఇందులో, వెంకటేష్ కి జంటగా కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2న చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే, నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆదర్శ కుటుంబం’ లో ఆయన పోషిస్తున్న పాత్రను రివీల్ చేశారు. ఇందులో, రోహిత్ తెలంగాణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
తాజాగా, రిలీజ్ చేసిన లుక్ తో ‘ఆదర్శ కుటుంబం’ మూవీలో రోహిత్ పోషిస్తున్న రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అర్థమవుతోంది. ఇక, ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. చిట్టిబాబు గా వెంకీ, స్వర్ణ పాత్రలో శ్రీనిధి కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. వరుస హిట్స్ మీద ఉన్న వెంకీ ఖాతాలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ద్వారా మరో హిట్ గ్యారెంటీ అని ఇప్పటికే, పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది.












