Aadarsha Kutumbam: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డ్రామా ‘ఆదర్శ కుటుంబం’. విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు డేట్ ఫిక్స్ చేస్తూ ఓ ఆసక్తికరమైన పోస్టర్ ని వదిలారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కి అన్నీ వర్గాల ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ ఇప్పటి వరకూ సినిమా చేయనప్పటికీ, ఆయన నటించిన బ్లాక్ బస్టర్స్ నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకి కథ-మాటలను అందించాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకే, వీరి కాంబోలో సినిమాను ప్రకటించగానే మంచి బజ్ క్రియేట్ అయింది.
ఇక, ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు డేట్ ని ఫిక్స్ చేసింది యూనిట్. ఈ సోమవారం (27.07.2026) నుంచి ఈ మూవీలో నటిస్తున్న ప్రధాన తారగణాన్ని పరిచయం చేయబోతున్నారు. వెంకటేష్ పోషిస్తున్న చిట్టిబాబు పాత్రను ముందుగా పరిచయం చేస్తారు.
ఆ తర్వాత స్వర్ణ పాత్రలో నటిస్తున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి పరిచయం కానుంది. అలాగే, యువిన్ పార్థవి.. రాజా ప్రజ్వల్ లు వెంకటేష్ కూతురు, కొడుకులుగా కనిపించనున్నారు. ఇలా, ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకి, వెంకీ తోడైతే నవ్వులతో థియేటర్స్ మోత మోగిపోవడం ఖాయం. కాగా, మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.












