సినిమా

King 100: నాగార్జున కూడా తొందరపడటం లేదు..హిట్ కొట్టాలనే కసి

రచన: Anshu4 నిమిషాల పఠనం

King 100: టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున తన మైల్ స్టోన్ మూవీ 100వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ సంస్థ నుంచి ఇప్పటికే ఎంతోమంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. టాలెంట్ ఉన్న దర్శకులను నాగ్ ఎంకరేజ్ చేస్తాడానికి అతిపెద్ద ఉదాహరణ రాంగోపాల్ వర్మనే తీసుకోవచ్చు. ఇప్పుడు, నాగ్ తన 100వ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతను తమిళ యంగ్ డైరెక్టర్ రా కార్తీక్ కి ఇచ్చాడు.

ఇది, కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతోంది. సాధారణంగా నాగార్జున కి లైన్ నచ్చితే అది పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ అయ్యే వరకూ మరో కథ జోలికి వెల్లడు. దీనికి, ఉదాహరణ సంతోషం. రచయితగా ఉన్న దశరథ్ 20 నిముషాల కథను నాగ్ కి చెప్పాడు. అది నచ్చి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడు. దీనికోసం 6 నెలలు టైమ్ పడుతుందని చెప్పినా కూడా ఓకే అన్నాడు తప్ప, ఈ గ్యాప్ లో ఇంకో సినిమాను చెయ్యలేదు.

ఇక, నాగార్జున తన 100వ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మధ్య తన చిన్న కొడుకు అఖిల్ నటించిన లెనిన్ సినిమా ప్రమోషన్స్ కోసం కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చాడు. మళ్ళీ, ఇప్పుడు సెట్స్ లోకి వెళ్ళాడు. అంతేకాదు, ప్రతీ సీన్ ని ఎంతో జాగ్రత్తగా షూట్ చేస్తున్నారు. ఈ మధ్య నాగార్జున సాలీడ్ హిట్ కొట్టలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలో కీలక పాత్రను పోషించాడు.

కానీ, అది నాగార్జున కి ఏమాత్రం ఉపయోగపడలేదు. అందుకే, ఇకపై గెస్ట్ రోల్ చేయడానికి నాగార్జున ఒప్పుకోడని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. హీరోగా నటించడానికే సిద్ధం అని డిసైడయ్యాడు. ఇక, కింగ్ 100వ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. మరి, ఇంత స్లోగా ఉంటే ఈ ఏడాది వస్తుందా లేదా అనేది డౌట్ గా ఉంది. కాగా, ఈ సినిమాలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో కనిపించబోతుందట.

#nagarjuna#king100#raakarthik#tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి