Health

Health: నిద్రలేవగానే ఫోన్ చూడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?..

రచన: Venu5 నిమిషాల పఠనం

ఫోన్‌.. చేతిలో ఉండే ఓ పరికరం మాత్రమే కాదు.. మన రోజువారీ జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. ఉదయం కళ్లు తెరిచిన వెంటనే ఫోన్‌.. రాత్రి నిద్రపోయే ముందు కూడా ఫోన్‌.. మధ్యలో పని, వినోదం, వార్తలు, స్నేహితులు, షాపింగ్‌.. అన్నింటికీ అదే ఆధారంగా మారింది.

ఫోన్‌.. చేతిలో ఉండే ఓ పరికరం మాత్రమే కాదు.. మన రోజువారీ జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. ఉదయం కళ్లు తెరిచిన వెంటనే ఫోన్‌.. రాత్రి నిద్రపోయే ముందు కూడా ఫోన్‌.. మధ్యలో పని, వినోదం, వార్తలు, స్నేహితులు, షాపింగ్‌.. అన్నింటికీ అదే ఆధారంగా మారింది. కొన్ని సందర్భాల్లో మనం ఫోన్‌ను ఉపయోగిస్తున్నామా? లేక ఫోన్‌ మన సమయాన్ని ఉపయోగించుకుంటుందా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

ఇక కొందరికి నిద్రలేవగానే ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. మరికొందరికి నిద్ర లేచింది మొదలు ఫోనే లోకంగా మారుతుంది. ఇలాంటి వారిని చూసినప్పుడు.. ఇది బద్ధకమా లేక క్రమశిక్షణ లేదా అనే అనుమానం కలుగుతుంది. ఇక మనకు నిద్రలో ఉన్న సమయంలో ప్రపంచంలో ఏం జరిగిందో తెలియదు. అందుకే నిద్రలేవగానే.. ఏమైనా కొత్త మెసేజ్ వచ్చిందా? ముఖ్యమైన వార్త ఏదైనా ఉందా? ఆఫీస్‌ నుంచి మెయిల్ వచ్చిందా? అనే ఆసక్తి, మనలో మొదలవుతుంది.

అందుకే లేవగానే ఫోన్ అందుకుంటారు.. అయితే ఉదయాన్నే ఫోన్‌ చూడటం ప్రతి ఒక్కరికీ ప్రమాదకరం కాదు. కానీ సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే.. రెండు నిమిషాల కోసం తీసుకున్న ఫోన్‌ గంటసేపు అంతులేని స్క్రోలింగ్‌గా మారినప్పుడు. మరోవైపు నిద్రలేవగానే ఫోన్ చూడటం వల్ల మీ మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుందని నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే నోటిఫికేషన్లు, ఈమెయిల్స్ లేదా సోషల్ మీడియా చూడటం వల్ల శరీరంలో 'కార్టిసోల్' అనే స్ట్రెస్ హార్మోన్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఇది రోజంతా మిమ్మల్ని ఆందోళనకు, చిరాకుకు గురిచేస్తుందని చెబుతున్నారు.

అంతేకాదు, డిజిటల్ స్క్రీన్ వల్ల కళ్ళపై విపరీతమైన భారం పడి చూపు మందగించడమే కాక, మీ ఏకాగ్రత దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఉదయాన్నే ఇతరుల సోషల్ మీడియా పోస్టులు చూడటం వల్ల, కొందరు తెలియకుండానే తమ జీవితాన్ని వారితో పోల్చుకోవడం మొదలుపెడతారు. ఇది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, రోజంతా ఒకరకమైన అసంతృప్తికి గురిచేస్తుంది.

అలాగే, నిద్ర లేవగానే దొరికే షార్ట్ డోపమైన్ వల్ల మీ మెదడు బద్ధకానికి అలవాటుపడి, సృజనాత్మకతను, నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతుంది కాబట్టి మీ ఉదయాన్ని ఫోన్ స్క్రీన్‌తో కాక, కాస్త స్వచ్ఛమైన గాలి, కొద్దిపాటి వ్యాయామంతో ప్రారంభించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. అలాగే ఫోన్‌ చూడటానికి ముందు కొద్దిసేపు వ్యక్తిగత పనులకు సమయం కేటాయించడం, అవసరం లేని నోటిఫికేషన్లు ఆఫ్‌ చేయడం, సోషల్‌ మీడియాకు సమయ పరిమితి పెట్టుకోవడం మంచిది అంటున్నారు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#phone#cell#waking up#look#Dangerous
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి