Megastar-Balayya: ఏజ్ బార్ అయిన సీనియర్ హీరోలు బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారుతున్నారు. హిందీలో భారీ తారాగణంతో మల్టీస్టారర్స్ రూపొందుతున్నాయి. ఇది, ఇప్పటి స్ట్రాటజీ కాదు..15 ఏళ్ళకి ముందు నుంచే కొనసాగుతోంది. అందుకే, తుమ్ బిన్..కభీ ఖుషి కభీ గమ్, మొహబ్బతే లాంటి భారీ మల్టీస్టారర్స్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి.
అదే, కల్చర్ మన సౌత్‌లోనూ మొదలైంది. కానీ, ఇక్కడ హీరోనే కథ మొత్తం మోస్తాడు. మిగతా గెస్ట్ రోల్ చేసే హీరో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు. ఇటీవల వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు, జైలర్ సినిమాలలో మాత్రం సీనియర్స్ కి కాస్త స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు దర్శకుడు. అంతేకాదు, ఆ రోల్ కూడా చాలా పవర్ ఫుల్ గా రాస్తున్నాడు. ఇక, ఈ కోవలోనే వింటేజ్ లుక్ అంటూ ఫేస్ వరకూ యంగ్ లుక్ ట్రై చేస్తున్నారు.
సీజీ ఉంది కాబట్టి..15 నుంచి 20 ఏళ్ల క్రితం మెగాస్టార్ ఎలా ఉన్నాడో అలా చూపించడానికి ట్రై చేసి సక్సెస్ అయ్యారు దర్శకులు. కానీ, కొన్ని చోట్ల ఏజ్ కనిపిస్తోంది. ఎంత కాదన్నా..వింటేజ్ లుక్ జస్ట్ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేయడానికే తప్ప..అదేమంత వర్కౌట్ అయింది లేదు. బాలయ్య కూడా డ్యూయల్ రోల్ చేసినప్పుడు ఇలాంటి వింటేజ్ లుక్ ట్రై చేసి ఆకట్టుకున్నాడు.
కానీ, ఇప్పుడు మన దర్శకులు కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇకపై మన మెగాస్టార్, బాలయ్యలను వింటేజ్ లుక్ లో కాకుండా న్యూ ఏజ్ లుక్ లోకి తీసుకొచ్చి చూపించబోతున్నారు. ప్రస్తుతం, చిరు హీరోగా బాబీ దర్శకత్వంలో మెగా 158 తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చిరు లుక్ వింటేజ్ కాకుండా న్యూ ఏజ్ లో ఉంటుందట. మరి, అది ఎలా ఉంటుందనేది మెగా 158 నుంచి చిరు ఫట్ లుక్ వస్తే గానీ ఆ సర్‌ప్రైజ్ కి స్టాప్ ఉంటుంది.
అలాగే, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తన మార్క్ యాక్షన్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో, బాలయ్యది డ్యూయల్ రోల్. గోపీచంద్ కూడా బాలయ్యను న్యూ ఏజ్ లుక్ లోనే చూపించబోతున్నాడట. ఇటీవల, కాకినాడ పోర్ట్ లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా బాలయ్యకి గాయాలయ్యాయి. సర్జరీ తర్వాత ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. త్వరలోనే, మళ్ళీ డబుల్ ఎనర్జీతో సింహం గర్జించబోతుంది. చూడాలి, మరి న్యూ ఏజ్ లుక్ అంటూ చేస్తున్న ప్రయోగం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో.












