స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

కయ్యాల క్లబ్‌గా మారిన జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్?

రచన: Swechaanews Chairman9 నిమిషాల పఠనం

జూబ్లీహిల్స్ క్లబ్‌లో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సొసైటీలో సభ్యుడే. రిచ్చెస్ట్ సభ్యులు ఇందులో ఎక్కువ మంది. కానీ, ఎంతో బాధ్యతగా ఉండాల్సిన కమిటీ సభ్యులు గోతులు తవ్వుకుంటూ రోజూ గొడవలు పడుతున్నారు. కుట్రలు, కుతంత్రాలు, దొరికినప్పుడు చూసుకుందాం.. అప్పటిదాకా దోచుకుందాం అనే ధ్యాస తప్ప పేరుకు తగ్గట్టు ఇంటర్నేషనల్ సెంటర్‌గా పని చేయడం లేదు.

  • అనధికారిక నిర్మాణాలతో భారీగా నిధుల గోల్‌మాల్?

  • గతేడాది రూ.20 కోట్ల ఫ్రాడ్‌పై సీసీఎస్‌లో ఫిర్యాదు

  • వారం క్రితం ఎన్నికల నిర్వహణ ఫోర్జరీ సంతకాలపై కేసు నమోదు?

  • పేరుకే బడాబాబుల బిల్డప్‌లు

  • ఒకరి వెనుక ఒకరు తవ్వుకుంటున్న గోతులు

  • ఆధిపత్యం కోసం ఆఫీసర్స్‌తో లాబీయింగ్

  • సభ్యుల తొలగింపు, చేర్పులపై ముదిరిన గొడవలు

  • సొసైటీలోనే కేసుల చెత్త అనుకుంటే క్లబ్‌కు పాకిన ఫిర్యాదులు

  • కిలారి రాజేశ్వర్ రావు తీరుతో రోజురోజుకు ముదురుతున్న జూబ్లీహిల్స్ వ్యవహారం

  • పేరొందిన అన్ని క్లబ్బుల్లో ఇదే కల్చర్

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్ ప్రత్యేక కథనం..

సీఎం సభ్యుడిగా ఉన్నా సద్దుమణగడం లేదు!

జూబ్లీహిల్స్ క్లబ్‌లో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సొసైటీలో సభ్యుడే. రిచ్చెస్ట్ సభ్యులు ఇందులో ఎక్కువ మంది. కానీ, ఎంతో బాధ్యతగా ఉండాల్సిన కమిటీ సభ్యులు గోతులు తవ్వుకుంటూ రోజూ గొడవలు పడుతున్నారు. కుట్రలు, కుతంత్రాలు, దొరికినప్పుడు చూసుకుందాం.. అప్పటిదాకా దోచుకుందాం అనే ధ్యాస తప్ప పేరుకు తగ్గట్టు ఇంటర్నేషనల్ సెంటర్‌గా పని చేయడం లేదు. రోజూ ఏదో ఒక వివాదంతో సభ్యులు బజారున పడుతున్నారు. పేరుకు న్యూస్ ఛానల్స్, పెద్ద పెద్ద ఆఫీసర్స్ తెలుసు అనే ముసుగులో కొట్టుకుంటున్నారు.

అసలు ఏం జరిగింది.. ఎవరీ కిలారి రాజేశ్?

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమంగా భూములు అమ్ముకున్నారని గతంలో కోపరేటివ్ సొసైటీ నివేదిక, విజిలెన్స్ ఎంక్వైరీ జరగగా, సీఐడీ కేసుల విచారణ కొనసాగుతూనే ఉంది. న్యూస్ ఛానల్స్ ముసుగులో ఇప్పటికీ అక్కడ దాగుడుమూతలు ఆడుతూనే ఉన్నారు. హైకోర్టులో పదుల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సొసైటీ సంగతి అలా ఉంచితే క్లబ్‌ను కూడా గబ్బు పట్టిస్తున్నారు. సభ్యులకు క్లబ్‌లో ఇన్నాళ్లూ కొంత రిలాక్స్ ఉండేది. కానీ, గత 5 ఏండ్లుగా కయ్యాలకు కాలు దువ్వుతూ బస్తీలో ఉండే కమ్యూనిటీ హల్‌లా ఇంటర్నేషనల్ క్లబ్‌ని మార్చేశారు. అందుకు కారణం మాజీ సెక్రెటరీ కిలారీ రాజేష్‌గా పిలవబడే రాజేశ్వర్ రావు అని అనేక ఆరోపణలు వస్తున్నాయి. హైకోర్టు కూడా అనధికార నిర్మాణాలు ఆపాలని ఆదేశాలు జారీ చేసినా లెక్క చేయకుండా తన ఫ్రెండ్ కంపెనీకి అప్పగించిన పనులు పూర్తి అయ్యేలా స్క్వేర్ ఫీట్ 4 వేలు అయ్యే ఖర్చుని 15 వేలుగా మార్చేశారని సీసీఎస్‌కు ఫిర్యాదు అందింది. ఓ రిటైర్డ్ అధికారిణి, ప్రస్తుత టాప్ పోలీస్ అధికారి నా చేతులో ఉన్నారని చెప్పుకుంటూ కిలారి రాజేశ్ అనే రాజేశ్వర్ రావు గత 5 ఏండ్లుగా చేస్తున్న దందానే చివరకు చిల్లర దందాగా మారిందని క్లబ్‌లో కళ్లు తెరిచిన వారంతా అనుకుంటున్నారు. క్లబ్‌లో భవన నిర్మాణాలు చేపట్టగా దాని పనుల కోసం తన స్నేహితుడికి చెందిన సేఫ్ యార్డ్స్ సంస్థకు 20 కోట్లు చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం స్క్వేర్ ఫీట్స్ ఎంత అంటే కేవలం 13 వేలు కూడా మించలేదు. అనుమతులు తీసుకున్నారా అంటే ఆ ఊసే లేదు. అందుకు హైకోర్టు మొట్టికాయలు కూడా వేసింది. తంబోలా టికెట్స్ ద్వారా కోటి వస్తే అకౌంట్స్‌లో కూడా వేయకుండానే దోచుకున్నారు. ఈ పాలకుల అవినీతి, అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేసి నివేదిక ఇచ్చారు. సరిగ్గా నిర్మాణాలు చేసింది లేదు కాని నిర్మాణం ఖర్చుతో 20 కోట్లు కిలారీ రాజేష్, సురేందర్ రెడ్డి దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై ఎఫ్ఐఆర్ అయిందో లేదో తెలియదు కాని వ్యవస్థలో జరిగిన లోపాలపై మాత్రం ఆడిటర్స్ ఇచ్చిన రిపోర్టులతో స్పష్టంగా సభ్యులకు తెలిసిపోయింది.

ఏక చత్రాధిపతిగా ఉన్న నరేంద్ర చౌదరికి చెక్ పెట్టాల్సిందేనా?

సొసైటీ చైర్మన్‌గా 10 ఏండ్లకు పైగా పని చేసినందుకు క్లబ్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా స్వచ్ఛందంగా వచ్చి పరిష్కరించాలని బై లాస్‌లో నరేంద్ర చౌదరి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో రాసుకున్నారని టాక్. క్లబ్‌లో ఉనికిని చాటుకోవడానికి వచ్చిన వారంతా ఎన్నికల పేరుతో నరేంద్ర చౌదరిని సాగనంపారు. ఎన్నికల ఖర్చుతో పాటు ఆయన చేసిన తప్పిదాలపై పాత కమిటీలోని సురేందర్ రెడ్డి, కే రాజేశ్వర్ రావులు ఫిర్యాదు చేశారు. దాంతో ఫోర్జరీ సంతకాలు అంటూ ఏకచత్రాధిపత్యంతో జరిగిన ఎన్నికలపై కేసు నమోదు అయ్యేలా చేశారు. బై లాస్ మర్చిపోయి పిర్యాదు చేయడంతో నరేంద్ర చౌదరిపై కేసు నమోదు కాలేదు. కానీ, అయినట్లు ముందే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఎప్పటికైనా ఆ బైలాస్ ఏంటో ఆయన సమ్రాజ్యం ఏంటో అని కబ్ల్ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎలాంటి లాభం లేకపోయినా ఫోర్జరీ అవసరమా?.. ఆ జీఎం ఎవరి మనిషి?

గత పాలకమండలిలో 9 మంది తాము సంతకం చేయలేదని, అయినా ఎలక్షన్స్ జరిపారని, అందులో లోపాలు ఉన్నాయని, ఫోర్జరీల సంతకాలతో క్లబ్‌ను కైవసం చేసుకున్నారని పాత కమిటీ ఫిర్యాదు చేసింది. కానీ, ఏదైనా లాభం ఉంటేనే ఫోర్జరీ చేస్తుంటారు. కానీ, ఇక్కడ బైలాస్ ప్రకారం నరేంద్ర చౌదరి ఎన్నికలు జరిపించారు. 25 లక్షలతో పాటు, ఇతర పాత కేసులపై ఖర్చులకు ఇచ్చినట్లు చూపించి గత నరేంద్ర చౌదరిలా చేస్తే ఎమవుతుంది అనుకున్నారు. అలానే ఎన్నికల ఖర్చులో 75 లక్షలు చూపించారు. అలా ఇంటర్నేషనల్ సెంటర్‌ని బస్తీలో ఓ పెండ్లికి జరిగే ఖర్చు, కమ్యూనిటీ హల్ నిర్వహణలా మార్చారు.

క్లబ్బుల్లో ఆధిపత్యం కోసం గబ్బుగా మారుస్తున్న నిజాం క్లబ్, గోల్ఫ్ క్లబ్‌తో పాటు జింఖానా, ఇలా అనేక క్లబ్బుల్లో అర్ధిక అసమానతలు ఉన్నా, దోచుకుంటున్నా, వాటి పేర్లతో రాజకీయ చదరంగం కొనసాగిస్తున్నా ఎవరినీ ఇన్నాళ్లు పట్టించుకో లేదు. కానీ, స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి అవినీతి ఏ వ్యవస్థలో జరిగినా వార్తలు రాస్తూనే ఉంటారు.

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్, 9848070809

#Jubilee Hills International Centre#Jubilee Hills Club Controversy#Swecha News#Telangana Club Disputes#CCS Fraud Case
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి