సినిమా

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో గోల్డెన్ ఛాన్స్?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Rukmini Vasanth: రుక్మిణి వసంత్ కి అదృష్టం బాగా పట్టినట్టుంది. వరుసగా అన్నీ పెద్ద బ్యానర్, పెద్ద హీరోల సినిమాలలో ప్రధాన పాత్ర పోషించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంటోంది. కన్నడలో మొదటి సినిమా చేసిన ఈ బ్యూటీ..ఆ తర్వాత తెలుగులో సప్తసారాగాలు దాటి అనే సినిమాతో బాగా గుర్తింపు పొందింది. కన్నడలో, రిషబ్ శెట్టి నటించిన కాంతార 1తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది.

దాంతో, జూనియర్ ఎన్‌టిర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది, రుక్మిణి కి ఊహించని అవకాశం. ఇలాంటి, క్రేజీ మూవీలో ఛాన్స్ అంటే ఎంతో లక్ ఉండాలి. ఇప్పుడు, అదే లక్కు మరో భారీ చిత్రంలో నటించే అవకాశం తెచ్చిపెట్టిందని కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం అవుతోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించబోతున్న మూవీలో రుక్మిణి వసంత్ కి ఓ కీలక పాత్రను చేసే ఛాన్స్ వచ్చిందట. కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. సీనియర్ నటి సిమ్రాన్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు రుక్మిణి కి ఓ కీ రోల్ చేసేందుకు మేకర్స్ ఎంచుకున్నారట. మరి, దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

కాగా, ఈ సినిమాకి 'ధర్మన్' అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇందులో రజినీకాంత్ ఓ డాక్టర్ పాత్రను పోషిస్తున్నారు. కబాలి, కాలా, జైలర్, జైలర్ 2, అణ్ణాత్తా లాంటి సినిమాలలో మాస్ హీరోగా యాక్షన్ సీన్ లో అదరగొట్టిన రజినీ, ఇప్పుడు డాక్టర్ అవతారంలో అలరించబోతున్నాడు. రోబోలో సైంటిస్ట్, రోబో పాత్రల్లో ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాడో అందరికీ తెలిసిందే.

#rukminivasanth#rajinikanth#kamalhassan#kollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి