సినిమా

Kollywood: సెట్స్ పైకి మణిరత్నం-సాయి పల్లవి ప్రాజెక్ట్!

రచన: Anshu3 నిమిషాల పఠనం

Kollywood: సాయి పల్లవి నటించబోతున్న మరో క్రేజీ సినిమాకి సంబందించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో సాయి పల్లవి నటించనున్న సంగతి తెలిసిందే. ఇంతకముందే, ఈ సినిమాను ప్రకటించారు. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.

విజయ్ సేతుపతి-సాయి పల్లవి జంటగా నటించబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి రాబోతుంది. మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ నంబర్ 23 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ మొదలవబోతోంది. పశ్చిమబెంగాల్ లోని కోల్‌కతాలో ఈ సినిమా షూటింగ్ మొదలవబోతోంది. మొత్తం 40 రోజుల పాటు ఓ లాంగ్ షెడ్యూల్ ని మణి రత్నం ప్లాన్ చేశాడు. కోల్‌కతా, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాలలో చిత్రీకరణ జరపనున్నారు.

లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. మణిరత్నం సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి లెజండరీ డైరెక్టర్ తో సాయి పల్లవి-విజయ్ సేతుపతి లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ తోడైతే ఆ ప్రాజెక్ట్ మీద అంచనాలు పీక్స్ లో ఉంటాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందనుందట.

హిందీలో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ సిరీస్ రామాయణ తో పాటు ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతుందని, ఇటీవలే కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినప్పటికీ, సాయి పల్లవి మళ్ళీ ఫుల్ ఫాంలోకి వచ్చి బ్యాక్ టు బ్యాక్ కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తోందని తెలుస్తోంది.

#maniratnam#saipallavi#vijaysethupathy#kollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి