ఏపీ

Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టంట్

రచన: NK3 నిమిషాల పఠనం

Ambati Rambabu: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అంబటి రాంబాబుకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెకు స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం అంబటి రాంబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.

శుక్రవారం అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కంగారు పడ్డ కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా యాంజియోగ్రామ్ చేసిన డాక్టర్లు ఆయనకు స్టెంట్ వేశారు. ప్రస్తుతం అంబటి రాంబాబు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం ఏమీ లేదని తెలిపారు.

అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారని తెలిసి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. డాక్టర్లు ఆయనకు స్టెంట్ వేశారని, ఇప్పుడు ఆయన హెల్త్ కండీషన్ నిలకడగా ఉందని తెలిశాక కుటుంబసభ్యులతో సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంబటి రాంబాబు త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు.

#Ambati Rambabu#Ysrcp#Stent#Surgery#Hyderabad#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి