తెలంగాణ

Telangana: పొన్నం ప్రభాకర్‌కు SIR నోటీసులు!..

రచన: Venu3 నిమిషాల పఠనం

SIR ప్రక్రియలో సాధారణ ఓటరైనా, ప్రజాప్రతినిధైనా ఒకే నిబంధనలు వర్తిస్తాయని ఈ సంఘటన నిరూపించింది.. ఓటర్ల వివరాల్లో ఉన్న తప్పులను గుర్తించడం, వాటిని ఆధారాలతో సరిచేయడం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం.. అందుకే ఓటర్ల జాబితా కచ్చితంగా ఉండేలా చూడటమే SIR ప్రక్రియ ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు..

తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ.. (SIR) ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారి నోటీసులు జారీ చేశారు. మంత్రి ఓటరు గుర్తింపు కార్డులో ఆయన తండ్రి పేరుకు సంబంధించిన వివరాలు తప్పుగా నమోదైనట్లు SIRలో చేపట్టిన వివరాల పరిశీలనలో గుర్తించారు. ఓటర్ల జాబితాలో నమోదైన వివరాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను సరిచూసే ప్రక్రియలో భాగంగా ఈ తప్పిదం వెలుగులోకి వచ్చింది.

దీంతో నిబంధనల ప్రకారం బీఎల్‌వో.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అధికారికంగా నోటీసులు ఇచ్చి, తండ్రి పేరు సవరణకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు.. కాగా ఈ నోటీసుపై మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు. తన తండ్రి పేరును సరిచేయడానికి సరైన ఆధార పత్రాలను అధికారులకు అందజేశారు. మంత్రి సమర్పించిన పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించి ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డులో అవసరమైన సవరణలు చేపట్టనున్నారు.

ఇక SIR ప్రక్రియలో సాధారణ ఓటరైనా, ప్రజాప్రతినిధైనా ఒకే నిబంధనలు వర్తిస్తాయని ఈ సంఘటన నిరూపించింది.. ఓటర్ల వివరాల్లో ఉన్న తప్పులను గుర్తించడం, వాటిని ఆధారాలతో సరిచేయడం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం.. అందుకే ఓటర్ల జాబితా కచ్చితంగా ఉండేలా చూడటమే SIR ప్రక్రియ ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు..

ఓటరుకు సంబంధించిన వివరాల్లో తేడాలు ఉన్నా.. పేరు, తండ్రి పేరు, చిరునామా వంటి వివరాల్లో పొరపాట్లు ఉన్నా వాటిని పరిశీలించి అవసరమైన మార్పులు చేయడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు జారీ చేసే నోటీసులకు ఓటర్లు స్పందించడం, సరైన ఆధారాలను సమర్పించడం ఎంతో ముఖ్యమని అధికారులు చెబుతున్నారు.

#telangana#Hyderabad#SIR notices issued#minister#ponnam-prabhakar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి