Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ గురించేనని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. దీపిక చెప్పిన మాటలు వింటే ఖచ్చితంగా అవి ప్రభాస్ గురించేనని మనకూ అర్థమవుతుంది. దీని కారణంగానే స్పిరిట్ మూవీ నుంచి దీపిక తప్పుకుందని స్పష్టం అయింది. ఇంతకీ, ఆమె అన్న మాటలేంటి..? ఇన్నాల్ళు ఎందుకు దీని ప్రస్థావన తీసుకురాలేదు..ఈ విషయాలన్నీ పూర్తి కథనంలో చూద్దాం.
స్పిరిట్ వివాదం:
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో ప్రస్తుతం సెట్స్‌పైనున్న సినిమా స్పిరిట్. కాప్ స్టోరీగా ఇది తెరకెక్కుతోంది. అయితే, ముందు ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక పడుకొన్ ఎంపికైంది. ఆ తర్వాత, అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో 'యానిమల్' బ్యూటీ త్రిప్తి దిమ్రీ వచ్చి చేరింది. దీపిక ఎందుకు తప్పుకుందీ..? అని అప్పట్లో రక రకాల వార్తలు ప్రచారంలో నిలిచాయి. 8 గంటల షిఫ్ట్ మాత్రమే పనిచేస్తానని, తన స్టాఫ్ కి కూడా మేయిన్‌టెనెన్స్ ఇవ్వాలని, లాభాలలో వాటా కావాలని.. దీపిక కండీషన్స్ పెట్టినట్టుగా చెప్పుకున్నారు.
నీ రేంజ్ బాలీవుడ్..ప్రభాస్ రేంజ్ గ్లోబల్ వైడ్:
అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక స్పిరిట్ నుంచి ఎందుకు తప్పుకుందో ఓపెన్‌గానే చెప్పింది. "ఆ మధ్య ఓ పెద్ద హీరో సినిమా నుంచి తప్పుకున్నాను..ఆ హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో నాకు తెలుసు. నాకున్న మార్కెట్ ఏంటో నాకు తెలుసు. అందుకే, ఆ హీరోతో సమానంగా రెమ్యునరేషన్ అడిగాను. నిజానికి, మార్కెట్లో ఆ హీరో కంటే నాకే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. అందుకు తగ్గట్టే నా రెమ్యునరేషన్ చెప్పాను. కానీ, మేకర్స్ అంత బడ్జెట్ లేదన్నారు. అందుకే, ఆ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేశానని చెప్పింది.
ఇదంతా కూడా ప్రభాస్ గురించి అని డార్లింగ్ ఫ్యాన్స్ కి అర్థమైంది. అందుకే, నీ రేంజ్ జస్ట్ బాలీవుడ్ వరకు మాత్రమే పరిమితం. మా ప్రభాస్ అన్న రేంజ్ గ్లోబల్ వైడ్‌గా ఉంది. ఆయనతో నీకసలు పోలికే లేదు..అని ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి, స్పిరిట్ నుంచి తప్పుకున్న ఇన్నాళ్ళకి అసలు విషయం బయటపెట్టింది దీపిక. దీనివల్లే, కల్కి 2 నుంచి కూడా ఆమెను తప్పించారని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.












