సినిమా

Rashmika Mandanna: గ్రేట్ బయోపిక్‌లో ఛాన్స్! ఈ ఒక్కటి చేస్తే చాలు!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Rahmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నకి ఓ గొప్ప బయోపిక్ చిత్రంలో నటించే అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం, విజయ్ దేవరకొండ సరసన రణబాలి మూవీ చేస్తోంది. అలాగే, మైసా అనే మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీలోనూ నటిస్తోంది రష్మిక, ఈ సినిమా షూటింగ్ సమయంలో గాయం కారణంగానే రెండు నెలలపాటు బ్రేక్ తీసుకుంది. అయితే, తాజా సమాచారం మేరకు లెజండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక నటించబోతోంది.

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నకి ఓ గొప్ప బయోపిక్ చిత్రంలో నటించే అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం, విజయ్ దేవరకొండ సరసన రణబాలి మూవీ చేస్తోంది. అలాగే, మైసా అనే మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీలోనూ నటిస్తోంది రష్మిక, ఈ సినిమా షూటింగ్ సమయంలో గాయం కారణంగానే రెండు నెలలపాటు బ్రేక్ తీసుకుంది. అయితే, తాజా సమాచారం మేరకు లెజండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక నటించబోతోంది.

నిర్మాతగా అల్లు అరవింద్:

గత కొంతకాలంగా మన సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో బయోపిక్స్ వచ్చి మంచి ఆదరణను దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దింవంతగ నటీనటుల జీవిత కథలను, క్రీడా కారుల జీవితాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. కంటెంట్ గనక బావుంటే ఈ బయోపిక్స్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాయి. దీనికి ఉదాహరణ ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమానే. తెలుగులో మాహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి.

భాషతో సంబంధం లేకుండా వచ్చిన బయోపిక్ చిత్రాలకి మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు, అలాంటి బయోపిక్ ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్షిది. ఎప్పటి నుంచో ఈ బయోపిక్ తెరకెక్కించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ పాత్రలో ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి కనిపించనుందని వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. కానీ, ఇప్పుడు సుబ్బలక్ష్మి పాత్రను రష్మిక చేయబోతుందట. ఈ బయోపిక్ ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్నారు. బన్నీ వాసు, రాక్‌లైన్ వెంకటేష్ సహ నిర్మాతలు.

పెళ్ళి తర్వాత రష్మిక కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్:

పెళ్ళి తర్వాత ఇప్పుడే కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు రష్మిక చేయబోతున్న ఈ బయోపిక్ కొత్తగా సైన్ చేసిందే కావడం విశేషం. ఇక, ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ నుంచి రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. త్వరలో, అధికారికంగా మరిన్ని విషయాలు వెల్లడికానున్నాయి.

#Rashmika Mandanna#MS Subbalaxmi Boipic#Allu Aravind#Geetha Arts#Gowtham Tinnanuri
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి