సినిమా

Bhagyashri Borse: హిట్ పడ్డా ఛాన్సులు లేవే? భాగ్యశ్రీ ప్లాన్స్ ఎంటో?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Bhagyashri Borse: మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో భాగ్యశ్రీ అందం, అభినయంతో బాగానే ఆకట్టుకుంది. నడుము అందాలతో గ్లామర్ ట్రీట్ కూడా ఇచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఇక, తెలుగులో భాగ్యశ్రీ కనిపించదనుకున్నారు.

ఫస్ట్ ఫ్లాప్ తర్వాత కూడా క్రేజీ ఆఫర్స్:

సాధారణంగా హీరోయిన్‌కి మొదటి సినిమా ఫ్లాపైతే, ఆ తర్వాత అంత ఈజీగా ఛాన్సులు రావంటుంటారు. కానీ, భాగ్యశ్రీకి మాత్రం కాంత, కింగ్డం, ఆంధాకింగ్ తాలూకా సినిమాలలో వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే, ఆమె లక్కేంటో గానీ, ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. కాంత మూవీ, ఆంధ్రాకింగ్ తాలూకా లలో పర్ఫార్మెన్స్‌తో బాగా ఆకట్టుకుంది.

ఇలా, పాజిటివ్ టాక్ మాత్రం తెచ్చుకుంది. ఇక్కడే, భాగ్యశ్రీకి మంచి అవకాశం దక్కింది. అదే, అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' సినిమా. వాస్తవానికి, ఈ సినిమాలో ముందు ఎంపికైంది డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. కానీ, వరుసగా తన చేతిలో క్రేజీ చిత్రాలుండటంతో డేట్స్ సర్దుబాటు కాక, 'లెనిన్' వదులుకోవాల్సి వచ్చింది. ఇదే, ఆఫర్ భాగ్యశ్రీకి రవడం..మూవీ హిట్ అవడం జరిగాయి. ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లోనూ చేరింది.

అయినా, ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో ఒకే ఒక్క సినిమా అఫీషియల్‌గా ఉంది. అది కూడా తమిళ సినిమా 'సేయాన్'. 'లెనిన్' లాంటి భారీ హిట్ తర్వాత కూడా భాగ్యశ్రీకి ఎందుకనో తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయలేదు. వచ్చినా ఆమె మంచి సినిమా చేయాలని ఒప్పుకోవడం లేదా..లేక ఒకే ఒక్క హిట్ కదా..అని మేకర్స్ ఆలోచిస్తున్నారా తెలియదు. చూడాలి, మరి భాగ్యశ్రీకి రానున్న రోజుల్లో ఎలాంటి అవకాశాలు వస్తాయో. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నదాని ప్రకారం జార్జి క్రిష్‌లో తానే హీరోయిన్ అని. అధికారికంగా మాత్రం ఏ కన్‌ఫర్మేషన్ లేదు.

#Bhagyashri Borse#Lenin#Seyan#Kollywood#Tollywood Actress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి