ఏపీ

AP : ఉపాధ్యాయుడిని వెంబడించి మరీ యువకుల దాడి.. (వీడియో)

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఏపీలో కొందరు యువకులు రెచ్చిపోయారు. ఉపాధ్యాయుడు అనే గౌరవం లేకుండా వెంబడించి మరీ తీవ్రంగా దాడికి పాల్పడ్డారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడులో చోటుచేసుకుంది. అయితే, ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడిన యువకులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు నుంచి పెదకూరపాడుకు వెళ్తున్న ఉపాధ్యాయుడు జంపని నరేష్ బాబును కొందరు యువకులు వెంబడించి మరీ ఆపారు. అయితే, రెండు కార్లు స్వల్పంగా ఢీకొనడంతోనే ఈ వివాదం నెలకొన్నట్టు సమాచారం. గొడవ చేయొద్దని కూర్చుని మాట్లాడుకుందామని సదరు ఉపాధ్యాయుడు చెబుతున్నా..సదరు యువకులు వినకుండా కారును వెంబడించినట్టు తెలిసింది.

అనంతరం పాఠశాల రహదారిలో ద్విచక్ర వాహనం అడ్డుపెట్టి మరీ ఉపాధ్యాయుడిని కారులో నుంచి కిందకు లాగి దాడికి పాల్పడినట్టు సమాచారం. చేతులతో, కొబ్బరి మట్టలతో దాడికి పాల్పడినట్టు తెలిసింది. ఉపాధ్యాయుడిపై కొబ్బరి మట్టలతో దాడి చేస్తుండగా..అతని కుటుంబసభ్యులు వీడియో తీసినట్టు సమాచారం. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయగా..నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఈ ఘటనలో బాధిత ఉపాధ్యాయుడు పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం.తన మీద పలువురు యువకులు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడుతుండగా తీసిన వీడియో ఆధారాలను పొలీసులకు సమర్పించినట్టు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

https://x.com/pulsenewsbreak/status/2093186404990042384?s=20

#Attack#Teacher#car hit#Andrapradesh#crime#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి