ప్రపంచం

బాస్ కాదు అంతకు మించి.. ప్రమోషన్లను నిర్ణయిస్తున్న ఏఐ!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

కార్పొరేట్ ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలంటే సాధారణంగా మేనేజర్లు, హెచ్‌ఆర్ (HR) టీమ్‌ల నిర్ణయాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త మార్క్ లోర్‌కు చెందిన ప్రముఖ ఫుడ్-టెక్ దిగ్గజం ‘వండర్’ (Wonder) కంపెనీలో మాత్రం ఈ కీలక బాధ్యతలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యవస్థకు అప్పగించారు.

కార్పొరేట్ ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలంటే సాధారణంగా మేనేజర్లు, హెచ్‌ఆర్ (HR) టీమ్‌ల నిర్ణయాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త మార్క్ లోర్‌కు చెందిన ప్రముఖ ఫుడ్-టెక్ దిగ్గజం ‘వండర్’ (Wonder) కంపెనీలో మాత్రం ఈ కీలక బాధ్యతలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యవస్థకు అప్పగించారు. మానవ మాత్రులకు ఉండే పక్షపాతాలు, వ్యక్తిగత విద్వేషాలకు తావులేకుండా కేవలం పనితీరు, డేటా ఆధారంగా ప్రమోషన్లను ఖరారు చేసేందుకు ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

ఈ AI ఆధారిత మూల్యాంకన విధానంలో ప్రతీ ఆరు నెలలకొకసారి ఒక ఉద్యోగి పనితీరును కనీసం 12మంది సహోద్యోగులు (Peers) రేట్ చేస్తారు. సహోద్యోగులు ఇచ్చిన రాతపూర్వక ఫీడ్‌బ్యాక్, నాయకత్వ లక్షణాలు, ప్రవర్తనలతో పాటు 'వాల్యూ అబోవ్ రీప్లేస్‌మెంట్' (VAR) అనే ప్రత్యేక మెట్రిక్‌ను AI విశ్లేషిస్తుంది. ఒక ఉద్యోగి కంపెనీని వీడితే ఆయన స్థానంలో మరొకరిని నియమించడం ఎంత కష్టమనేదాన్ని ఈ VAR స్కోర్ నిర్ణయిస్తుంది. ఈ డేటానంతటినీ సమగ్రంగా పరిశోధించి ప్రమోషన్‌కు అర్హులైన ఉద్యోగుల జాబితాను AI సిఫార్సు చేస్తుంది.

అయితే ఏఐ ఇచ్చే సిఫార్సులే ఆఖరి నిర్ణయం కాదని, ఒకవేళ ఏఐ ఏవైనా ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోలేదని భావిస్తే మేనేజర్లు దానిని సవరించే వెసులుబాటు ఉంది. కానీ రోజురోజుకూ టెక్నాలజీ సవరణల వల్ల ఏఐ సిఫార్సులను మార్చాల్సిన అవసరం దాదాపు రావడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. వీటితో పాటు ‘వండర్’ కంపెనీ తైక్వాండో బెల్ట్ ర్యాంకింగ్స్ తరహాలో ఉద్యోగుల స్థాయిలను వర్గీకరిస్తూ, సహోద్యోగుల జీతభత్యాల వివరాలు సైతం తెలుసుకునేలా అత్యంత పారదర్శకమైన జీతాల విధానాన్ని అమలు చేస్తోంది.

ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీసింది. మేనేజర్ల ఏకపక్ష వైఖరి, పక్షపాతం నుంచి మహిళలు, మైనారిటీ ఉద్యోగులకు రక్షణ కల్పించి సమాన అవకాశాలు కల్పించవచ్చని ఒక వర్గం స్వాగతిస్తోంది. కానీ మనుషుల ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్షేత్రస్థాయి శ్రమను కేవలం డేటాతోనే కొలవడం ఎంతవరకు సమంజసమనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి AI చేరడం సాంకేతిక విప్లవంలో మరో మైలురాయిగా నిలిచింది.

 

#AIinHR#WonderCompany#MarcLore#CorporateTrends#ArtificialIntelligence#TechNews2026
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి