సినిమా

Sharwanand Bhogi: ‘భోగి’ నుంచి రాఖీ లుక్..ఈసారి శర్వా గట్టిగా కొట్టేయడం ఖాయం.

రచన: Anshu4 నిమిషాల పఠనం

Sharwanand Bhogi: ‘భోగి’ నుంచి రాఖీ లుక్..ఈసారి శర్వా గట్టిగా కొట్టేయడం ఖాయం. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే అదే అర్థమవుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. డింపుల్ హయాతి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్టుగా తెలుస్తోంది. ఈరోజు రాఖీ పండుగ. ఈ సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఇక, ఈ సినిమాలో శర్వానంద్ ‘గంగ’ అనే ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నాడు. తాజాగా వదిలిన పోస్టర్‌లో “గంగ ఒక్కడే… ప్రాణాలు ఐదు”.. అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్నట్టుగా అర్థమవుతోంది. ఇప్పటి వరకూ సంపత్ నంది తీసిన సినిమాల కంటే భోగి చిత్రం కంప్లీట్ డిఫరెంట్ అని అర్థమవుతోంది. శర్వా చేతిలో కొడవలి పట్టుకుని, అక్కాచెల్లెళ్లకు తాటి ముంజలు తీసి ఇస్తూ కూర్చున్న లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల అనుబంధాన్ని హైలైట్ చేస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా భోగి చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. శర్వాకి గతంలో శతమానంభవతి సినిమా మంచి సక్సెస్‌ను ఇచ్చింది. మళ్ళీ, ఆ తర్వాత ఆ స్థాయి హిట్ దక్కలేదు. గత చిత్రం బైకర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆశించిన కమర్షియల్ సక్సెస్ దక్కలేదని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపించింది.

దాంతో, ఇప్పుడు మళ్ళీ శతమానంభవతి లాంటి ఫ్యామిలీ కథాండంతో తెరక్కుతున్న భోగి సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా సంపత్ నంది కూడా దర్శకుడిగా హిట్ అందుకోలేకపోయాడు. ఈ సినిమా హిట్ సంపత్ నందికి తప్పనిసరి. చూడాలి, ఈ కాంబినేషన్‌లో రాబోతున్న భోగి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో. కాగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు.

#Sharwanand#Bhogi#Sampath Nandi#Dimple Hayati#Anupama Parameshwaran
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి