International

భారీ వరదలు.. నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇతర దేశాలతో కలిపి భారత్‌కు షాక్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

భారీ ఆకస్మిక వరదలతో అల్లాడిపోతున్న నేపాల్ ప్రభుత్వం ఒక అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు, రెస్క్యూ చర్యలలో విదేశీ బృందాల సాయాన్ని తీసుకోకూడదని నిర్ణయించింది. తమ దేశ భద్రతా బలగాలు మాత్రమే సహాయక చర్యలు చేపట్టగలవని స్పష్టం చేస్తూ, భారత్, చైనాతో పాటు పలు ప్రపంచ దేశాలు పంపిన రెస్క్యూ సహాయ ప్రతిపాదనలను తిరస్కరించింది.

 తాజా సమాచారం ప్రకారం.. ఈ విపత్తులో ఇప్పటివరకు 469 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు వెయ్యి మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వందలాది మంది భారతీయులు కూడా అచూకీ లేకుండా పోవడంతో, భారత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలను పంపేందుకు అనుమతి కోరగా నేపాల్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను కూడా అంగీకరించలేదు. 2015 నాటి భారీ భూకంప సమయంలో పెద్ద ఎత్తున విదేశీ బృందాలు రావడంతో ఎదురైన సమన్వయ లోపాలు, నిర్వహణా లోపాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 ప్రస్తుతం నేపాల్ పోలీస్ శాఖకు చెందిన 4,348 మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. రసువా, నువాకోట్, ధాదింగ్ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గల్లంతైన వారిలో 178 మంది భారతీయులతో పాటు అమెరికా, మలేషియా, ఉక్రెయిన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు చెందిన విదేశీ పౌరులు కూడా ఉన్నారు.

 విదేశీ రెస్క్యూ బృందాలను నిరాకరించినప్పటికీ, ఆర్థిక మరియు మానవతా సాయాన్ని స్వీకరించేందుకు నేపాల్ సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే అమెరికా 5 లక్షల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర వైద్య సామగ్రిని అందజేసింది. విదేశీ పౌరుల ఆచూకీ, సహాయక చర్యల సమన్వయం కోసం నేపాల్ విదేశాంగ శాఖ ప్రత్యేక అత్యవసర నియంత్రణ కేంద్రాన్ని (Emergency Control Centre) అందుబాటులోకి తెచ్చింది.

#NepalFlooding#NepalDisaster#NDRF#ForeignAid#NepalRelief#FlashFloods2026#swechanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి