బ్యాంకుల నుంచి రూ. వేల కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టే వారు క్రమంగా పెరుగుతున్నారు.దేశంలో ఇప్పటికే ప్రభుత్వ బ్యాంకులను ముంచిన వారి చిట్టా చాలానే ఉంది. కంపెనీలు, పరిశ్రమల స్థాపన కోసం దేశీయ బ్యాంకుల నుంచి రూ. వందల కోట్లు రుణాలు తీసుకుంటన్న కొందరు.. తిరిగి చెల్లించడం లేదు. ఫలితంగా బ్యాంకులు డిఫాల్ట్ అవుతున్నాయి.తీరా ఆ నష్టాన్ని పూడ్చటానికి కేంద్రం ప్రజధనాన్ని వినియోగించాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే దేశంలో డిఫాల్టర్స్ పెరిగిపోతున్నారు.
ఇప్పటికే కొందరు ప్రభుత్వ రంగ బ్యాంకులను ముంచి దేశం దాటారు. విజయ్ మాల్యా, మొహుల్ చోక్సీ వంటి వారు ఈ కోవలోకి వస్తారు. ఈ క్రమంలోనే దేశంలోని అనేక బ్యాంకులను కేంద్రం మెర్జ్ చేసిన విషయం తెలిసిందే.రుణాలు ఇవ్వడంలో అధికారులు బ్యాగ్రౌండ్ సరిగా చేయకుండా ముడుపులు తీసుకుని రుణాలు ఇవ్వడం వల్లే ఇలా ఆర్థిక నేరగాళ్లు పెరుగుతున్నారని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజాగా దేశంలో మరో డిఫాల్టర్ వెలుగులోకి వచ్చారు. ఏకంగా రూ.22 వేల కోట్లు బ్యాంకులకు ఆయన అప్పుపడినట్టు తెలిసింది. అయితే, కేవలం రూ.6.5 కోట్లకే బ్యాంకులతో సెటిల్‌మెంట్ కోసం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) అంగీకరించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకివెళితే.. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర రుణాల చెల్లింపు విషయంలో దివాళా తీశారు. ఆయన చేసిన రూ.22,006.57 కోట్లు అప్పు తీర్చలేక చేతులెత్తేశాడు. దీంతో దీంతో బ్యాంకులు ఏకంగా 99.97 శాతం మేర తమ డబ్బులను కోల్పోనున్నాయి.
రీ పేమెంట్ ప్లాన్ ప్రకారం బ్యాంకులకు రూ.6.25 కోట్లు.. దివాళా పరిష్కార ప్రక్రియకు మరో రూ. 25 లక్షలు మాత్రమే ఖర్చు చేయడానికి సుభాష్ చంద్ర ముందుకొచ్చారు.దీనికి NCLT ఆమోదం తెలపగా.. ఈ ప్రతిపాదనపై LIC హౌసింగ్ ఫైనాన్స్ పరిధిలోని రుణ దాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత తక్కువ మొత్తంలో రికవరీని ఆమోదించడం సరైనది కాదని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎదుట తమ వాదనలు వినిపించారు. కానీ, ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ రీపేమెంట్ ప్లాన్‌లో ప్రతిపాదించిన మొత్తం పోలిస్తే తక్కువగానే ఉందని ట్రైబ్యునల్ వెల్లడించింది.
https://x.com/pulsenewsbreak/status/2092899750614020286?s=20
ఈ ప్లాన్‌ని సుభాష్ తిరస్కరిస్తే పూర్తిస్థాయి దివాళా ప్రక్రియలోకి వెళ్లే అవకాశం ఉందని.. దాంతో ప్రతిపాదిత మొత్తం కన్నా ఎక్కువ రికవరీ వచ్చే అవకాశం లేదని NCLT అభిప్రాయపడింది. అయితే, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు సుభాష్ అంగీకరించిన క్లెయిమ్ రూ. 1322.39 కోట్లుగా ఉంటే.. ప్రతిపాదిత ప్లాన్ ప్రకారం రూ.38.09 లక్షలు మాత్రమే క్లెయిమ్ అందనుంది. దీంతో బ్యాంకులు, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ భారీగా నష్టపోనున్నాయి.












