తెలంగాణ

TG : ప్రతిపక్షాలు, ప్రజలపై పోలీసుల జులుం : హరీశ్ రావు

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రభుత్వమా? పోలీసు పాలనా? అని ప్రశ్నించారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసుల దాడులు క్షమించరానిదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రభుత్వమా? పోలీసు పాలనా? అని ప్రశ్నించారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసుల దాడులు క్షమించరానిదని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పోలీసుల బాధితుల పట్ల ప్రవర్తించిన తీరును ఈ సందర్భంగా ఉటంకించారు. శుక్రవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.

‘మొన్న మహబూబాబాద్‌లో ఓ పోలీసు అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి క్రూరంగా ప్రవర్తించాడు. నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని బూటుకాళ్లతో తన్ని, మూత్రం తాగించారనే ఆరోపణలు.

నేడు సూర్యాపేటలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసులు.. కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు.. నిరసన తెలిపిన వారిపై CI దౌర్జన్యం.సీఎం రేవంత్ రెడ్డి.. అసలు తెలంగాణలో ఉన్నది ప్రభుత్వమా? లేక పోలీసు పాలనా? ప్రతిపక్షాలపై పోలీసులతో జులుం..

ప్రజలపై పోలీసులతో జులుం.. ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే అరెస్టులు.. హక్కులు అడిగితే దౌర్జన్యాలు.. ఇదేనా మీరు చెప్పుకున్న ప్రజాపాలన?’ అంటూ ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కారకులైన పోలీసులపై విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు.

https://x.com/BRSHarish/status/2093241241752268845?s=20

కాగా, తమ జీవనాధారమైన దుకాణాలు తొలగించారని, న్యాయం చేయాలని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న బాధితులపై కోదాడ పోలీసులు దారుణంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. కోదాడ టౌన్ సీఐ శివశంకర్.. బాధితుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడం.. మహిళలు అని కూడా చూడకుండా నెట్టేయడం, ఓ వ్యక్తిని ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్ వాహనం ఎక్కించడం వంటి వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హరీశ్ రావు ఈ మేరకు స్పందించారు.

#harish rao#brs#kodada ci shivashanker#police#cm revanth reddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి