సినిమా

Yash-Toxic: ‘టాక్సిక్’కి ఏపీలో టికెట్ రేట్ పెంచుకోవచ్చా? అదెట్లా!

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Yash-Toxic: మన తెలుగు సినిమా విడుదల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తూ జీవోను పాస్ చేస్తున్నాయి. అయితే, అలా పెంచుకునే వెసులుబాటు అన్నీ సినిమాలకి కాదు. కథ, బడ్జెట్, హీరో లాంటివన్నీ పరిగణలోకి తీసుకొని షూటింగ్ ఎక్కువశాతం ఎక్కడ జరిపారో పరిశీలించి హైక్ ఇస్తున్నారు. ముఖ్యంగా, మన రీజినల్ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

కానీ, పరభాషా చిత్రాలకి కూడా ఏపీ తెలంగాణాలలో టికెట్ రేట్ పెంచుకోవడానికి వీలుంటుందా? అలా మన ప్రభూత్వాలు ఒప్పుకుంటాయా? ఇదెక్కడి న్యాయం..ఇలాంటి ప్రశ్నలన్నీ లెవనెత్తాల్సి వస్తోంది. దీనికి, కారణం టాక్సిక్ సినిమా. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన హెవీ యాక్షన్ అండ్ గ్యాంగ్‌స్టర్ చిత్రం. దీనికి, లేడీ డైనమిక్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు.

కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ తో మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, ఎల్‌ఎల్‌పి బ్యానర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కోనంకి వెంకట నారాయణ అలాగే హీరో యష్ కలిసి నిర్మించారు. కియారా అద్వానీ, హ్యూమ ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, నయనతార ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 26న పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లను పెంచనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

అయితే, ఓ కన్నడ చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లను పెంచడానికి ఎలా అనుమతిస్తారనే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. యష్ కి మన టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. కానీ, అది ఇక్కడి రీజనల్ సినిమా కాదు. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకూ టాక్సిక్ మూవీకి కన్నడలోనే టికెట్ రేట్ల విషయం రాలేదు. అలాంటిది, మన తెలుగు రాష్ట్రాలలో ఎందుకు పెంచుతారు..ఇందుకు, ప్రభుత్వాలు ఎలా ఒప్పుకుంటాయనే విమర్శలు వస్తున్నాయి. మరి, దీనికి సంబందించి అసలు విషయం ఏంటనేది మేకర్స్ రియాక్ట్ అయితే గానీ తెలీదు.

#yash#toxic#geethu mohandas#kiara advani#nayanathara
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి