22A Lands: 22 ఏ నిషేదిత జాబితా అప్ డేట్ లో అధికారుల పొరపాటుతో ఇబ్బందులు వచ్చాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఇప్పటికే 22 ఏ రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. నిన్న దాదాపు 5కు పైగా 22ఏ జాబితా రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. గ్రేటర్ పరిధిలో ఉన్న పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శిస్తానని మీడియాతో చిట్ చాట్ లో మంత్రి పొంగులేటి వెల్లడించారు.
హరీశ్ రావు పదేళ్లు అధికారంలో ఉండి 30శాతం కమీషన్లు మర్చిపోవడం లేదని విమర్శించారు. కాళేశ్వరం కూలితే హరీశ్ రావు ఎందుకు బాధ్యత తీసుకోలేదు? అని ప్రశ్నించారు. నేను బాధ్యతగా ఉన్నాను కాబట్టే బాధ్యత తీసుకొని సమస్యను పరిష్కరిస్తా అంటున్నా అని చెప్పారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాటాకు చెప్పుళ్లకు భయపడనని అన్నారు. మహేశ్వర్ రెడ్డి దగ్గర ఏదైనా ఆధారం ఉంటే చూపించాలన్నారు.
'ఫీనిక్స్ కంపెనీ రాఘవ కంపెనీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎన్నో జరుగుతాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 20 ఏళ్ల నుంచి వ్యాపార రంగంలో ఉన్నాడు.
అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రిగా పొంగులేటి కొనసాగుతున్నాడు. రబ్బర్ చెప్పులతో వచ్చి వేల కోట్లకు ఎదగలేదు. 22-ఏ నిషేధిత జాబితా వల్ల ప్రజలు ఆందోళన చెందవద్దు. అధికారులతో కమిటీ వేశాం. సమస్యను నెలాఖరు వరకు పరిష్కరిస్తాం'' అని మంత్రి పొంగులేటి తెలిపారు.


