Husharu Pittalu: మనం సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు గాని, చెడు మాత్రం చేయకూడదు. ఇప్పటి తరం యూత్ అత్యధికంగా అడిక్ట్ అవుతుంది కొన్ని అడల్ట్ కంటెంట్ సినిమాలకి. ప్రజల మీద, ప్రేక్షకుల మీద, సినీ ప్రేమికుల మీద, అభిమానుల మీద ఎక్కువగా ప్రభావం చూపేది సినిమా. అత్యంత పవర్ ఫుల్ మాధ్యమం సినిమా. అలాంటి సినిమా వల్ల కోట్లు సంపాదించడమే లక్ష్యంగా కొందరు బూతు సినిమాలను తీసి యువతను పక్కదోవ పట్టిస్తున్నారు అనడానికి ఇటీవల వచ్చిన హుషారు పిట్టలు సినిమానే ఉదాహరణ.
యువ దర్శకులు త్వరగా జనాలను ఆకట్టుకోవాలని యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ అంటూ ఇలాంటి రోత సినిమాలను తీస్తున్నారు. మనకి ఒక మాట ఉంది. గెస్ట్.. గెస్ట్ రూం వరకే రావాలి గానీ, బెడ్రూం, బాత్రూం వరకూ రాకూడదు అని. సినిమాలో చూపించే కొన్ని సన్నివేశాలు యువత చూడటం వల్ల జరిగే అనర్ధాలు, ప్రమాదాలు, దరిద్రాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటి, సినిమాలకి అసలు అనుమతి ఇవ్వకూడదనే కఠిన నిర్ణయాలు ఉంటే సమాజానికి కాస్తైనా మేలు చేసినవారవుతారు.
ఒకప్పుడు మారుతి:
దర్శకుడు మారుతి కెరీర్ ప్రారంభంలో.. ఈరోజుల్లో, 'బస్ స్టాప్' లాంటి సినిమాలు తీశాడు. ఇవి కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు. కానీ, కొన్ని సన్నివేశాలు కుటుంబంతో కలిసి చూడలేము. కాబట్టి, అప్పట్లో మారుతిని కాస్త నెగిటివ్‌గానే కామెంట్స్ చేశారు. అడల్ట్ కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవుతుందా..యువతను పక్కదారి పట్టిస్తే నిర్మాతకి డబ్బులొస్తాయా? వాళ్ళు తీస్తున్నారు సరే. మనం ఎందుకు చూడాలి, మన పిల్లలకి ఏం నేర్పించాలి..అంటే..చేతిలో ఫోన్ ఉంటే మనం ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు..అన్నీ వాళ్ళే నేర్చుకుంటారు..ఇదే కొందరు తల్లిదండ్రుల సమాధానం.
రోజులో కనీసం ఒక్క గంటైనా మీ పిల్లల కోసం సమయం కేటాయించడయ్యా..ఇది నిపుణులు ఇస్తున్న సలహాలు. మనకి అవి చేదుగా ఉంటాయి. అన్నీ సినిమాల వల్ల అందరూ అలాగే అని అనలేము గానీ, చాలా వరకూ సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలకి మాత్రం బాధ్యులం ముమ్మాటికి మనమే. అన్నమయ్య సినిమా రెండు వందల రోజులు ఆడింది.
హనుమాన్ జంక్షన్ 150 రోజుల ఆడిన బొమ్మ. నువ్వే కావాలి సినిమా 100 రోజులకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మొత్తం బ్లాక్. ఇవన్ని కూడా సినిమాలే. కానీ, ఇప్పుడు అందరికీ కావాల్సింది ఆర్ఎక్స్ 100, హుషారు పిట్టలు, ఏడు చేపల కథ, గరం మసాలా, ధమ్ బిర్యానీ. వీటికి అడ్డు కట్ట వెయ్యాలంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా, సెన్సార్ బోర్డుల్లో తమిళనాడు ప్రస్తుత ముఖ్య మంత్రి విజయ్ లాంటి వారు ఉండాలి.


