తెలంగాణ

హైదరాబాద్‌లో 4.3కిలోమీటర్ల పొడవుతో అతిపెద్ద ఫ్లైఓవర్.. పనులు షురూ!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే కీలక మార్గంలో ప్రయాణించే వాహనదారులకు జీహెచ్‌ఎంసీ (GHMC) తీపి కబురు అందించింది. భాగ్యనగరంలో నిత్యం నెలకొనే తీవ్ర ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

 తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే కీలక మార్గంలో ప్రయాణించే వాహనదారులకు జీహెచ్‌ఎంసీ (GHMC) తీపి కబురు అందించింది. భాగ్యనగరంలో నిత్యం నెలకొనే తీవ్ర ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. నగరంలోనే అత్యంత పొడవైనదిగా నిలవనున్న ఈ భారీ ఫ్లైఓవర్ పనులను జీహెచ్‌ఎంసీ అధికారులు వేగవంతం చేశారు.

 ఈ ప్రాజెక్టు వివరాలను పరిశీలిస్తే.. పంజాగుట్టలోని ముఫకమ్‌జా ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వద్ద ప్రారంభమయ్యే ఈ ఎలివేటెడ్ కారిడార్, కేబీఆర్ పార్క్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌ను దాటుకుని రోడ్ నెంబర్ 36ను కలుపుతుంది. మొత్తం 4.3కిలోమీటర్ల పొడవునా 6 లైన్లతో (6-Lane) ఈ భారీ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే మార్కింగ్ పనులు పూర్తి కాగా, ప్రస్తుతం పిల్లర్లు నిర్మించబోయే ప్రాంతాల్లో సాయిల్ టెస్టింగ్ పనులు జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

 ఈ ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ అధికారులు రెండు ప్యాకేజీలుగా విభజించి పనులను శరవేగంగా ముందడుగు వేయిస్తున్నారు. మొదటి ప్యాకేజీ కింద జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముగ్ధా జంక్షన్ వరకు, రెండో ప్యాకేజీ కింద ముగ్ధా జంక్షన్ నుంచి ముఫకమ్‌జా కాలేజ్ వరకు నిర్మాణాలు జరగనున్నాయి. ఈ కారిడార్ నిర్మాణాన్ని కేవలం రెండేళ్ల వ్యవధిలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఈ పనులను సమీక్షించి కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్, జంక్షన్ల అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆదేశించారు.

 ప్రస్తుతం పంజాగుట్ట నుంచి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా మాదాపూర్, ఐటీ కారిడార్, హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనదారులకు నాగార్జున సర్కిల్, టీవీ9 సిగ్నల్, ముగ్ధా జంక్షన్లలో రద్దీ సమయంలో 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే సిగ్నల్ లేని ఉచిత ప్రయాణం సాధ్యమై ప్రయాణ సమయం నిమిషాల్లోకి తగ్గుతుంది. నగరంలో సాధారణ ఫ్లైఓవర్లు 2.5 నుంచి 3 కిలోమీటర్ల మేర ఉండగా, ఏకంగా 4.3 కిలోమీటర్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లోనే అతిపెద్ద ఫ్లైఓవర్‌గా రికార్డు సృష్టించనుంది.

#PanjaguttaJubileeHillsFlyover#GHMCProjects2026#HyderabadTrafficUpdates#ElevatedCorridorHyderabad#KBRParkFlyover#TelanganaInfrastructure#HyderabadNewsTelugu#UrbanDevelopmentTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి