సినిమా

Keerthy Suresh: హిందీ సినిమా ఫ్లాప్..కీర్తి లాజిక్ కరెక్టే కదా!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Keerthy Suresh: స్టార్స్ నటించిన ప్రతీ సినిమా హిట్టావ్వాలని లేదు. బ్లాక్ బస్టర్ కొట్టాలని టార్గెట్ ఏమీ ఉండదు. సినిమా చేయడం వరకే మేకర్స్ పని. అలాగే, హీరోహీరోయిన్ విషయంలోనూ. ఒక సినిమా ఫలితాన్ని చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. పోటీగా మరో సినిమా..లేదా దర్శకుడు తీర్చిదిద్దిన తీరు..సీజన్..ఇలా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Keerthy Suresh: స్టార్స్ నటించిన ప్రతీ సినిమా హిట్టావ్వాలని లేదు. బ్లాక్ బస్టర్ కొట్టాలని టార్గెట్ ఏమీ ఉండదు. సినిమా చేయడం వరకే మేకర్స్ పని. అలాగే, హీరోహీరోయిన్ విషయంలోనూ. ఒక సినిమా ఫలితాన్ని చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. పోటీగా మరో సినిమా..లేదా దర్శకుడు తీర్చిదిద్దిన తీరు..సీజన్..ఇలా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే, తాజాగా కీర్తి సురేష్.. ఆమె నటించిన బేబీ జాన్ సినిమా ఫ్లాప్ అన్న మాటకు..దానివల్ల నాకు పోయిందేమి లేదంటూ సమాధానమిచ్చింది.

తెలుగు, తమిళ భాషలలో వరుసగా సినిమాలు చేస్తున్న కీర్తికి బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. ఆ సినిమానే బేబీ జాన్. ఈ సినిమాలో ఆమె బాగానే అందాలను ఆరబోసింది. హిందీలో మొదటి సినిమా కాబట్టి, గ్లామర్‌గా కనిపించడానికి నో చెప్పలేదు కూడా. ఈ సినిమాలో వరుణ్ ధావన్‌తో పాటు కీర్తి సురేష్, వామికా గబ్బి, జారా జయానా, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే, కీర్తి బాలీవుడ్ డెబ్యూ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇదే, విషయాన్ని తాజాగా 'అక్క' ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించారు.

దీనికి, కీర్తి సురేష్ ఎంతో తెలివిగా ..నా మొదటి హిందీ సినిమా ఫ్లాపైనా పోయిందేమీ లేదని..నా నటన నచ్చి రాజ్ కుమార్ రావుతో నటించే ఛాన్స్ దక్కిందని తెలిపింది. వీరిద్దరు కలిసి "రాఫ్తార్" అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం, హిందీలో కీర్తి నటించిన 'అక్క' సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో 'బేబీ జాన్' ఫ్లాప్ గురించి అడిగారు. కీర్తి కూడా అంతే ఘాటుగా సమాధానమిచ్చింది.

నాకు తమిళంలో ఫ్లాప్స్ వచ్చిన సమయంలోనే నాగ్ అశ్విన్..'మహానటి' సినిమాలో ఛాన్స్ ఇచ్చారని గుర్తు చేసింది. ఒక సినిమా ఫ్లాప్ కావడానికి నేను బాధ్యురాలిని కాదంటూ సింపుల్‌గా చెప్పుకొచ్చింది. ఇలా, సినిమాలు ఫ్లాపవుతున్నా కూడా ఈ బ్యూటీకి అన్నీ భాషలలో వరుసగా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ ఏడాదిలోనే 'అక్క', 'రాఫ్తార్', తమిళంలో 'సత్యవాన్ సావిత్రి' సినిమా విడుదల కానున్నాయి. 2027 ప్రారంభంలో 'జనవరి 12 విడుదల' రిలీజ్ కానుంది.

#Keerthy Suresh#Baby John#Akka#Sathyavan Savithri#Janavari 12 Vidudhala
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి