Ramayana: సోషల్ మీడియా ప్రభావం ప్రతీ విషయం మీద ఉంటోంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ నవంబర్ 5న మైథలాజికల్ మూవీ రామాయణ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా, రామాయణ నుంచి 'మంగళ రంగ్' అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట ట్యూన్ విషయంలో టోలర్స్ గట్టిగా ఆస్కార్ విన్నర్‌ను కామెంట్స్ చేస్తున్నారు. దీనికి, ఆయన ఇచ్చిన కౌంటర్ బుల్లెట్‌లా తగిలింది.
సీతగా సాయి పల్లవి నప్పలేదన్న నెటిజన్స్:
రామాయణ సినిమా నుంచి ట్రైలర్ విడుదలయ్యాక, ఈ సినిమాలో సీత పాత్రకి సాయి పల్లవి అసలు ఏమాత్రం సూటవలేదని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. ఆమె పాత్ర మీద, గెటప్ గురించి, కాస్ట్యూంస్ విషయంలో అత్యంత దారుణంగా కామెంట్స్ చేశారు. అయితే, ఇటీవల వచ్చిన రంగులే అనే సాంగ్ వచ్చాక..ఆ ట్రోల్స్ కాస్త పాజిటివ్‌గా మారాయి. సీతగా ఆమె బావుందంటూ మాట్లాడుకున్నారు.
ఆస్కార్ విన్నర్ రెహమాన్‌పై నెగిటివ్ కామెంట్స్!
ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ మీద పడ్డారు ఇప్పుడు..సోషల్ మీడియాలో కాచుకొని కూర్చొనే ట్రోలర్స్. తాజాగా విడుదలైన 'మంగళ రంగ్' అనే పాట గతంలో వచ్చిన ఛావా ట్యూన్ మాదిరిగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, 'ఖవాలీ' పాట పోలికలో సాగుతుందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూఫీ ఖవ్వాలీ బీట్‌ను 'మంగళ రంగ్' పాటకు రెహ్మాన్ వాడడం దారుణం అంటూ నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
రెహమాన్ కౌంటర్..
నాకు ఇలాంటి ట్రోలింగ్స్ కొత్తేమీ కాదంటూ క్లారిటీ ఇచ్చాడు. నేనేదో పనిలో ఉంటే నా కొడుకువచ్చి నాన్నా మీగురించి నెగిటివ్‌గా రాశారంటూ ఆ కామెంట్స్ చూపిస్తాడు. నేను వాటిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటాను. కొన్నాళ్ళకి వాళ్ళే మళ్ళీ పాజిటివ్‌గా రాస్తున్నారు. అయినా, వీటన్నిటిని చూసి..పట్టించుకునేంత ఓపిక గానీ, సమయం గానీ నాకు లేవని రెహమాన్ సమాధానమిచ్చాడు. ఒక సినిమాకి 5 భాషలలో సాంగ్స్ కంపోజ్ చేయడం ఎంత కష్టమో మాకు తెలుసంటూ జవాబిచ్చాడు మన ఆస్కార్ విన్నర్.


