క్రైమ్

Crime : చైన్ స్నాచర్ల భీభత్సం..మహిళలను బైక్‌తో ఢీకొట్టి, కట్టర్‌తో కట్ చేసి!

రచన: Kumar••3 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు మీద ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేస్తున్న ఈ దుండగులు.. ఈసారి మరింత బరితెగించారు. పట్టపగలే ఓ మహిళను వెంబడించి మరీ యాక్సిడెంట్ చేసి ఆమె మెడలోని చైన్‌ను కట్టర్ సాయంతో కట్ చేసి దొంగిలించుకుని వెళ్లిపోయారు.

హైదరాబాద్ మహానగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు మీద ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేస్తున్న ఈ దుండగులు.. ఈసారి మరింత బరితెగించారు. పట్టపగలే ఓ మహిళను వెంబడించి మరీ యాక్సిడెంట్ చేసి ఆమె మెడలోని చైన్‌ను కట్టర్ సాయంతో కట్ చేసి దొంగిలించుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం స్టేజి వద్ద చోటుచేసుకోగా మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. నల్గొండ జాతీయ రహదారిపై హిమబిందు అనే మహిళ ద్విచక్ర వాహనంపై తన కొడుకుతో కలిసి వెళ్తోంది. నకిరేకల్‌ నుంచి ఆటిపాముల వైపు వెళ్తుండగా ఎదురుగా బైక్ మీద హెల్మెట్లు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు.. బాధితురాలి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో తల్లీకొడుకులను రోడ్డుపై కిందపడిపోగా ఆమెను బెదిరించారు. చంపేస్తామని బెదిరింపులకు గురిచేసి కట్టర్‌తో దాడి చేసి ఆమె 3 తులాల పుస్తెలతాడును దుండగులు ఎత్తుకెళ్లారు.

స్నాచర్ల దాడిలో బాధిత మహిళ చేతులకు గాయాలు అయ్యాయి. కట్టర్‌తో దాడి చేయడంతో మెడ దగ్గర కూడా గాయం అయినట్టు సమాచారం. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు ఆ వెంటనే తేరుకుని తన కొడుకుని తీసుకుని నేరుగా కట్టంగూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

బాధితురాలు వెల్లడించిన వివరాల మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేషనల్ హైవేకు ఇరువైపులా గల దుకాణాల వద్ద అమర్చిన సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పట్టపగలే జాతీయ రహదారి మీద చైన్ స్నాచర్లు అరాచకం సృష్టిస్తుంటే తమకు రక్షణేదంటూ ప్రయాణికులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

#Chain snachers#nalgonda#crime#women chain theft#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి